Home /News /crime /

A SUB INSPECTOR OF POLICE AND 2 CONSTABLES ROB JEWELLER AND CASH WORTH RUPEES 35 LAKHS IN UTTARPRADESH MS

కనిపించని నాలుగో సింహాలే దొంగలుగా మారితే..? దొంగలతో కలిసి నగల దుకాణాన్ని ఊడ్చేసిన ఖాకీలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించే నాలుగో సింహమే పోలీసు అన్నాడో సినీ రచయిత. కానీ ఇక్కడ పోలీసులు సింహాలు కాదు.. దొంగల్లా మారారు. దొంగలతో చేతులు కలిపి.. వారితో ఏకంగా ఓ ముఠానే నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
    వారంతా పోలీసులు. సమాజంలో అశాంతిని చల్లార్చి ప్రజలకు శాంతి కల్పించేలా చూడటంలో వారిది ప్రముఖ పాత్ర. అంతేకాదు దొంగతనాలు, దోపిడీలు జరగకుండా ప్రజలను, వ్యాపారస్తులను కాపాడే బృహత్తరమైన బాధ్యత వారిమీద ఉంది. చిన్న దొంగతనమైనా సరే.. దొంగలను చాకచక్యంగా పట్టుకోవాలి. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించే నాలుగో సింహమే పోలీసు అన్నాడో సినీ రచయిత. కానీ ఇక్కడ పోలీసులు సింహాలు కాదు.. దొంగల్లా మారారు. దొంగలతో చేతులు కలిపి.. వారితో ఏకంగా ఓ ముఠానే నిర్వహిస్తున్నారు. వీరంతా కలిసి ఓ నగల దుకాణాన్ని సాంతం ఊడ్చేశారు.

    ఉత్తరప్రదేశ్... నేరాలకు అడ్డా. దేశంలో పెద్ద రాష్ట్రం కావడంతో సహజంగానే ఇక్కడ నేరాల రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే దొంగలు, దోపిడీల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కూడా వారి బాటే పట్టారు. ఒక నగల దుకాణంలో దూరి.. ఆ షాప్ లో ఉన్న బంగారు ఆభరణాలను సాంతం దోచారు. గోరఖ్పూర్ పరిధిలో ఉన్న బస్తీ జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన.

    బస్తీ జిల్లాలోని పురాణి బస్తీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ దోపిడీకి పాల్పడ్డారు. స్థానికంగా ఉండే ఒక దొంగల ముఠాతో చేతులు కలిపిన సదరు పోలీసులు.. వాళ్లతో కలిసి చోరీ చేశారు.. మహరాజ్ గంజ్ లో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లి.. అందులోని బంగారు, వెండి ఆభరణాలను కొట్టేశారు. వాటి విలువ... రూ. 35 లక్షల దాకా ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ చోరీలో పోలీసులు భారీగానే పట్టుబడ్డారు. మొత్తం 12 మందికి ఈ కేసుతో సంబంధమున్నట్టు తెలుస్తున్నది.

    చోరీకి పాల్పడ్డ దొంగలు, దొంగ పోలీసులపై కేసు నమోదైంది. ఈ దోపిడీకి వారు వినియోగించిన వాహానాన్ని కూడా సీజ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు. నిందితులను సబ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ యాదవ్, కానిస్టేబుల్ మహేందర్, సంతోష్ యాదవ్ లుగా గుర్తించారు. వారిని సేవల నుంచి తప్పించే ప్రక్రియ కూడా జరుగుతుందని అన్నారు. మరో తొమ్మది మంది పోలీసులకు కూడా ఈ కేసుతో సంబంధముందని ఆరోపణలున్నాయని.. అవి నిజమని తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Gold, Gold jewellery, Up news, Uttarpradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు