A STUDENT HAD A BIRTHDAY PARTY AT THE SCHOOL COMMITTED SUICIDE BY DRINKING INSECTICIDE DUE TO HARASSMENT BY THE SCHOOL MANAGEMENT KMM VB
School Student: స్కూల్లో బర్త్ డే పార్టీ చేసుకున్నాడు ఆ విద్యార్థి.. యాజమాన్యం వేధింపులతో.. చివరకు ఇలా చేశాడు..
ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం: ఖమ్మంలోని ఓ పాఠశాల యాజమాన్యం అతి ఉత్సాహం ని చూపి ఓ నిండు ప్రాణాన్ని తీసేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ సంతోషంగా ఉన్నడనుకున్న క్షణాలు అంతలోనే విషాదంగా మారాయి. పదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మంలోని ఓ పాఠశాల యాజమాన్యం అతి ఉత్సాహం ని చూపి ఓ నిండు ప్రాణాన్ని తీసేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ సంతోషంగా ఉన్నడనుకున్న క్షణాలు అంతలోనే విషాదంగా మారాయి. పదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మమత హాస్పిటల్ సమీపంలోని హార్వెస్ట్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న భాను ప్రకాష్ అనే విద్యార్థి తన బర్త్ డే వేడుకలను సరదాగా తరగతి గదిలో స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు. ఈ విషయం కాస్త స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్ళింది.
సీసీ ఫుటేజీలో నమోదైన నా బర్త్ డే వేడుకలను చూసిన యాజమాన్యం ఆ విద్యార్థి పై అనేక విధాలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తోటి విద్యార్థుల సమక్షంలో యజమాన్యం వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగినట్లు తెలిపారు. విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ఖమ్మం నగర శివారు దనవాయిగూడెం ఏరియాలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను కార్పొరేషన్ అధికారులు తగలబెట్టారు. దాని నుంచి వెలువడుతున్న పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతే కాకుండా దట్టమైన పొగ బైపాస్ రోడ్డు, మామిళ్ళగూడెం,బుర్హన్ పురం,మయూరీసెంటర్ వరకు వ్యాపించటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎన్విరాల్ మెంట్ ఏఈ శ్రీనివాస్ ను రాపర్తి నగర్ లోని టీఎన్జీవో కాలనీ సమీపంలో అక్కడి ప్రజలు అతని చుట్టుముట్టి కార్పొరేషన్ కమిషనర్ వచ్చే వరకు శ్రీనివాస్ ను అక్కడి నుండి పంపించమని ప్రజలు ధర్నాకు దిగారు. స్థానికులు నివాసం ఉండే ఏరియాలో ఇలాంటి పని చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో మరోసారి ఇలాంటివి జరకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.