Home /News /crime /

A STRANGE LOVE STORY HAS BECOME A TOPIC OF DISCUSSION IN JHARKHAND JAMSHEDPUR DISTRICT SSR

OMG: ‘మొగుడూపెళ్లాం.. ఓ ఫేస్‌బుక్ లవర్’.. కానీ ‘కన్యాదానం’ సినిమాలో కూడా ఈ ఎండింగ్ లేదు..!

నమిత, ఆమె ప్రియుడు శుక్ర

నమిత, ఆమె ప్రియుడు శుక్ర

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ఇద్దరు పిల్లల తల్లి ప్రేమలో పడటమే ఇందుకు కారణం. ఈ ఘటన గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకున్నారు.

    జంషెడ్‌పూర్: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ఇద్దరు పిల్లల తల్లి ప్రేమలో పడటమే ఇందుకు కారణం. ఈ ఘటన గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జంషెడ్‌పూర్‌ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో కడఘోడ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన నమిత మహతో, సంజయ్ మహతో భార్యాభర్తలు. వీరికి 2016లో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఒక బాబు, ఒక పాప. సంజయ్ భార్యకు స్మార్ట్‌ఫోన్ వినియోగించే అలవాటుంది. సోషల్ మీడియా కూడా వినియోగించే సంజయ్ భార్య నమితకు ఫేస్‌బుక్‌లో అపరిచిత వ్యక్తులతో చాట్ చేస్తూ ఉండేది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఫేస్‌బుక్ వాడొద్దని, ఎవరితో పడితే వాళ్లతో చాటింగ్ చేయవద్దని సంజయ్ భార్యను హెచ్చరించాడు.

    ఇది కూడా చదవండి: HouseWife: పెళ్లై ఆరేళ్లు అవుతున్నా భర్తతో పిల్లలు కలగలేదని ఈమె ఓ నిర్ణయం తీసుకుంది.. కానీ ఏం సుఖం..

    అంతేకాదు.. వాట్సాప్‌లో ఎవరితోనో నమిత తరచూ చాటింగ్ చేస్తూ ఉండటాన్ని కూడా సంజయ్ గమనించాడు. ఈ విషయంలో కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఎన్నిసార్లు హెచ్చరించినా భర్త సూచనలను నమిత పెద్దగా పట్టించుకునేది కాదు. ఈ క్రమంలోనే.. నమిత ఎవరో అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడుతుందని సంజయ్ గుర్తించాడు. నమిత ప్రవర్తనను, మాటలను బట్టి ఆమె మరో మగాడికి దగ్గరవుతుందని అతనికి అర్థమైంది. నమిత జీవితంలో అనుకోని అతిథి ఎవరో వస్తున్నారని, అతనితో వెళ్లిపోయేందుకు ఆమె సిద్ధపడిందని సంజయ్‌కు తెలిసింది.

    ఇది కూడా చదవండి: Married Woman: అసలు ఈ ఘటన గురించి తెలిశాక ఏం చెప్తాం.. ఈ ఇద్దరూ కలిసి చేసిన పని వల్ల..

    నమిత ప్రేమించిన ఆ యువకుడి పేరు శుక్ర. ముంబైకి చెందిన ఇతనితో నమిత చాట్ చేస్తూ, కాల్స్ మాట్లాడుతూ దగ్గరయింది. తనను చూడటానికి ఊరు రావాలని లేకపోతే చచ్చిపోతానని నమిత తన ప్రియుడికి తేల్చి చెప్పింది. దీంతో.. నమిత ప్రియుడు ఆమె ఉంటున్న ఊరికి వెళ్లాడు. నమిత అతనితో కలిసి వెళ్లిపోయింది. చివరకు నమిత భర్త సంజయ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు వరకూ వ్యవహారం వెళ్లిందని తెలుసుకున్న నమిత, ఆమె ప్రియుడు శుక్ర తిరిగి అదే గ్రామానికి చేరుకున్నారు. ఊరి పెద్దలు వీరి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు.

    ఇది కూడా చదవండి: Family: భార్యాభర్తలు.. ఒక పాప.. బాబు.. ఇంత చక్కగా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు లేదు.. ఏమైందంటే..

    నమితకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం సంజయ్ చేసినప్పటికీ ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయేందుకే సిద్ధపడింది. తన ప్రియుడిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి ఉండలేనని తేల్చి చెప్పింది. ఆమె అంత స్పష్టంగా చెప్పడంతో గ్రామస్తులు కూడా నమిత, ఆమె ప్రియుడు కలిసి ఉండటానికి పచ్చ జెండా ఊపారు. సంజయ్ కూడా భార్యను ఆమె ప్రియుడితో పంపించేందుకు ఒప్పుకున్నాడు. కానీ.. ఒక కండీషన్ పెట్టాడు. నమిత ఆమె ప్రియుడితోనే వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే ఇద్దరు పిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్లాలని సంజయ్ తేల్చి చెప్పాడు. నమిత, ఆమె ప్రియుడు అందుకు అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. నమిత, ఆమె ప్రియుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇలాంటి బంధాలు ఎంతవరకూ చివరిదాకా నిలుస్తాయో చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా ఈ ‘భార్యాభర్త ఓ ఫేస్‌బుక్ ప్రియడు’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Husband, Jharkhand, Lovers, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు