కూతుర్ని తొమ్మిది సార్లు తల్లిని చేసిన తండ్రి.. 20 ఏళ్ల పాటు ఆమెపై..

Crime News: అమెరికాలోని ఓక్లోహామాకు చెందిన హెన్రీ మిచెల్ పీట్టే(62).. 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు బాలికను వివాహం చేసుకున్నాడు. వివాహం మాటున ఆమెపై ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడేవాడు.

news18-telugu
Updated: June 14, 2019, 8:52 AM IST
కూతుర్ని తొమ్మిది సార్లు తల్లిని చేసిన తండ్రి.. 20 ఏళ్ల పాటు ఆమెపై..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 8:52 AM IST
అది 1997.. కన్న తండ్రి కాదని వెళ్లిపోయాడు.. కూతురు ఉండగానే తల్లి ఇంకొకరిని పెళ్లి చేసుకొంది.. అప్పటికి ఆ బాలిక వయసు 10 ఏళ్లు.. ఆమెపై కన్నేసిన తండ్రి కాని తండ్రి అదను కోసం ఎదురు చూశాడు. ఇంతలో ఆ బాలిక తల్లి అతడితో గొడవ పడి వేరు కాపురం పెట్టింది. ఒక రోజు ఆ బాలికను కిడ్నాప్ చేసిన ఆ కామాంధుడు ఇంట్లో బందీ చేసి 20 ఏళ్ల పాటు ఆమెపై లైంగిక దాడి చేసి 9 సార్లు తల్లిని చేశాడు. వివరాల్లోకెళితే.. అమెరికాలోని ఓక్లోహామాకు చెందిన హెన్రీ మిచెల్ పీట్టే(62).. 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు బాలికను వివాహం చేసుకున్నాడు. వివాహం మాటున ఆమెపై ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడేవాడు. అలా రెండు దశాబ్దాల పాటు నరకం చూపించాడు. ఈ కాలంలో ఆమెను తొమ్మది సార్లు తల్లిని చేశాడు. 15 ఏళ్ల వయసులోనే ఆమె తొలి బిడ్డను జన్మనిచ్చింది. ఎన్నో సందర్భాల్లో గర్భ స్రావం అయ్యేలా ఆమె కడుపుపై పిడిగుద్దులు కురిపించేవాడు. దారుణంగా చితకబాది అట్ల కర్రతో వాతలు పెట్టేవాడు.

అయితే, 2016లో ఓ రోజు బాధితురాలు, ఆమె తొమ్మిది మంది పిల్లల్ని చూసిన ఓ జంట.. అనుమానం వచ్చి ఆరా తీయగా వివరాలు బయటపడ్డాయి. ఆ జంట వారందర్నీ తీసుకెళ్లి పోలీసులకు జరిగినదంతా వివరించింది. దీంతో 2017 డిసెంబరులో హెన్రీపై అభియోగం మోపారు. ఆ కేసు విచారణ ఈ నెల 6న విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బాధితురాలు తనపై గత రెండు దశాబ్దాలుగా వృద్ధుడు ప్రవర్తించిన తీరును, తన పిల్లలపై జరిగిన దాడిని వివరించి కన్నీంటిపర్యంతమైంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...