• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A SON WHO STRANGLED HIS MOTHER FOR NOT PAYING FOR ALCOHOL BN

తాగుడుకు డబ్బులివ్వలేదని.. కన్నతల్లినే చంపిన తనయుడు

తాగుడుకు డబ్బులివ్వలేదని.. కన్నతల్లినే చంపిన తనయుడు

ప్రతీకాత్మక చిత్రం

అశోక్ తాగుడుకు బానిసై.. గురువారం మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలంటూ అడిగాడు. దానికి అంజిలమ్మ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అశోక్ తన తల్లి అంజిలమ్మను గొంతు నులిమి చంపేశాడు.

  • Share this:
    తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తల్లిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని గొంతునులిమి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా బొంరాన్‌పేట మండలం దుద్యాలకు చెందిన అశోక్, భార్యపిల్లలు, తల్లి అంజిలమ్మ(60)తో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అశోక్ తాగుడుకు బానిసై.. గురువారం మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలంటూ అడిగాడు. దానికి అంజిలమ్మ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అశోక్ తన తల్లి అంజిలమ్మను గొంతు నులిమి చంపేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు