Home /News /crime /

A SON WHO COULD NOT BEAR THE DEATH OF HIS MOTHER COMMITTED SUICIDE BY HANGING HIMSELF IN THE SAME CEMETERY PRV

Son love: నిను వీడి నేనుండలేనమ్మా.. తల్లిని దహనం చేసిన అదే శ్మశానంలోకి కొడుకు వెళ్లి.. 

student suicide

student suicide

మాతృప్రేమ గురించి అందరికీ తెలిసిందే. కానీ, తనను ప్రేమగా పెంచి.. పెద్ద చేసిన అమ్మ ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ తనయుడు.. జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు.

  మాతృమూర్తి ప్రేమ మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం తనను ప్రేమగా పెంచి.. పెద్ద చేసిన అమ్మ ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ తనయుడు.. జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. అమ్మ అంత్యక్రియలు చేసిన శ్శశానవాటిక (Cemetery)లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీరు పెట్టించే ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

  గోల్నాక శ్యామ్‌నగర్‌లో నివాసముండే నాగేందర్‌, లక్ష్మీబాయి (60) దంపతులకు ఇద్దరు తనయులు. పిల్లల చిన్నతనంలోనే నాగేందర్‌ (Nagendhar) తనువు చాలించాడు. లక్ష్మీబాయి కూలీ పనులకు వెళ్లి కుమారులు వినోద్‌కుమార్‌ (36), విజయ్‌కుమార్‌లను పెంచి పెద్దచేసింది. వినోద్‌కుమార్‌ (Vinodh kumar) కు ఇంకా పెళ్లి కాలేదు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

  క్యాన్సర్‌ (cancer)తో గత కొంతకాలంగా బాధపడుతున్న లక్ష్మిబాయి చనిపోగా… బుధవారం గోల్నాక హర్రాస్‌పెంట శ్మశానవాటిక (Cemetery)లో అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ లేదన్న బాధను తట్టుకోలేకపోయిన వినోద్‌ (Vinodh) అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. అమ్మను ఖననం చేసిన శ్మశాన వాటిక షెడ్డులో ఉరేసుకుని (hanging himself) చనిపోయాడు.

  కాగా, గత నెలలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తన బిడ్డల మరణాన్ని తట్టుకోలేక తల్లి చనిపోయింది.  డిసెంబర్‌ 22న రాత్రి ఇంట్లో చికెన్‌ వండి ఇద్దరు పిల్లలు సహా తల్లి తిని పడుకున్నారు. మరుసటి రోజు పిల్లలిద్దరికి రక్తపు వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో వారిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు.

  నీలోఫర్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి కుమారుడు డిసెంబర్‌ 27న మృతి చెందాడు. కూతరు జనవరి 10న మృతి చెందింది. అప్పటి నుంచి అనిత ఒంటరైంది. దీంతో మనోవేదనకు గురై  మధాహ్నం ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 

  ఫుడ్‌ ఫాయిజన్‌తో రెండు వారాల వ్యవధిలో కన్న పిల్లలు కళ్ల ముందే చనిపోవడంతో జీర్ణించుకోలేని ఆ తల్లి.. అటు భర్త.. ఇటు పిల్లలు లేని జీవితం తనకు వద్దనుకుంది. మనోవ్యధతో ఆ తల్లి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన విషాద ఘటన మనోహరాబాద్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మనోహరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన పోతరాజు అనిత (31) కూలిపని చేసుకుంటూ తన కూతురు లక్ష్మిప్రియ (11), కుమారుడు కిషోర్‌ (8)లతో కలిసి జీవిస్తోంది. ఇదిలా ఉండగా 18 నెలల క్రితం తన భర్త రాము అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అనిత కూడా తనువు చాలించింది.

  ఇవి కూడా చదవండి :

  రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

  ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Hyderabad, Man commit to suicide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు