Home /News /crime /

A SOFTWARE ENGINEER WAS BRUTALLY MURDERED IN SANGAREDDY A FEW DAYS AFTER LOVE MARRIAGE MDK PRV

Software engineer murder: ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ దారుణ హత్య.. 

నారాయణ రెడ్డి పెళ్లి ఫొటో

నారాయణ రెడ్డి పెళ్లి ఫొటో

సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న  సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ (Software Engineer) నారాయణరెడ్డి (25)ని హత్య చేశారు దుండగులు.

    (K. Veeranna, News 18, Medak)

    సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న  సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ (Software Engineer) నారాయణరెడ్డి (25)ని హత్య చేశారు (Brutally murder) దుండగులు. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు శవం మాత్రం సగమే కాలినట్లు పోలీసులు తెలిపారు.

    వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని కేపీహెచ్​బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నారాయణరెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని  ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా యువతి, నారాయణరెడ్డి ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిపై కోపం పెంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డి కనిపించలేదు. గత కొద్దిరోజులుగా నారాయణ రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో జూన్ 30న కేపీహెచ్​బీ  పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది.

    మద్యం తాగేందుకు తీసుకెళ్లి..

    ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు..  నారాయణ రెడ్డి కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాసరెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట తాగారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటిచారు.

    శ్రీనివాస్​రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబసభ్యులే నారాయణరెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు అధికారికంగా పుర్తి వివరాలు రావలిసి ఉంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Burtally murder, Crime news, Medak, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు