credit card యాక్టివేషన్ కాల్ కట్ -లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయం -Siddipet సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లబోదిబో

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా క్రెడిట్ కార్డును పొందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దాన్ని యాక్టివేట్ చేసుకునే క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి క్షణాల్లో వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. సిద్దిపేట్ లో చోటుచేసుకున్న ఈ సైబర్ మోసంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

 • Share this:
  (K.VeerannaNews18Medak)
  టెక్నాలజీ వ్యాప్తి చెందుతోన్న కొద్దీ అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సెక్యూరిటీ విభాగాలు ఎన్ని హెచ్చరికలు చేసినా, బ్యాంకులు, సంస్థలు తమ కస్టమర్లకు ఎన్ని సూచనలు చేసినా మోసపోతోన్నవారి సంఖ్య తగ్గడంలేదు. సిద్దిపేటలో చోటుచేసుకున్న తాజా ఉదంతంలో.. కొత్తగా క్రెడిట్ కార్డు పొందిన ఓ టెకీ దాన్ని యాక్టివేషన్ చేసే క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి క్షణాల్లో వేలాది రూపాయాలు పోగొట్టుకున్నాడు..

  గ్యాడ్జెట్లను వాడుతోన్న వాళ్లలో పెద్దగా చదువుకోని వాళ్లకంటే ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే ఎక్కువగా నేరస్తుల చేతిలో బలవుతోన్న ఉదంతాలు పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసుకునే క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేసును సిద్దిపేట్ జిల్లా పోలీసులు మీడియాకు వెల్లడించారు.

  Huzurabad: ఆ ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలుపు - నా ముందు KTR పిల్ల బచ్చా : Revanth reddy


  సిద్దిపేట్ జిల్లా సిద్దిపేట్ మండలం రంగదాంపల్లిలో చోటుచేసుకున్న సైబర్ నేరంపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్ కుమార్ చెప్పిన వివరాలివి.. సిద్దిపేట్ అర్బన్ మండలం రంగదాంపల్లి గ్రామానికి చెందిన నిమ్మ కార్తీక్ రెడ్డి.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ టెక్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కరోనా నేపథ్యంలో అతను ఇంటి నుంచే పనిచేస్తున్నాడు

  కార్తిక్ రెడ్డి ఇటీవలే ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు . కార్డును యాక్టివేట్ చేసుకునే క్రమంలో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మధ్యలోనే అది డిస్ కనెక్ట్ అయింది. ఎలా పసిగట్టారో ఏమోగానీ, మరు నిమిషమే సైబర్ నేరగాళ్లు కార్తీక్ కు ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ కోసం ఓ లింకు పంపుతామని, దాన్ని ఓపెన్ చేసి డీటెయిల్స్ నింపాలని చెప్పారు..

  Jr NTR మనసు మార్చే ప్రయత్నం? -చర్చలకు వెళ్లింది ఎవరో తెలుసా? -చంద్రబాబు మంతనాలపై లోకేశ్ అలక!


  ఫోన్ చేసింది బ్యాంకువాళ్లేమోననే భ్రమలో కార్తీక్ సదరు లింకును ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలను అప్ లోడ్ చేశాడు. అంతే, చూస్తుండగానే అతని కార్డులో ఉన్న 49,995 రూపాయలు మాయమైపోయాయి. అతని మొబైల్ నంబర్ కు ‘మీ క్రెడిట్ కార్డు నుంచి రూ.49,995 డెబిట్ అయ్యాయి’అని మెసేజ్ వచ్చింది. బిత్తరపోయిన బాధితుడు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరాతీశాడు..

  బ్యాంక్ అధికారుల సూచన మేరకు కార్తీక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కింద కేసు నమోదైంది. లోతైన దర్యాప్తు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్న పోలీసులు.. సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఆన్ లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల వ్యవహారంలో జాత్రత్త వహించాలని హెచ్చరించారు.
  Published by:Madhu Kota
  First published: