అమెరికాలోని (America) మేరీలాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. నల్గొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్ (Sai charan) మృతిచెందారు. సాయి చరణ్ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా (A software engineer from Nalgonda) పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు (shot dead by a black man) జరిపాడు. దీంతో సాయి చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు తీవ్ర విచారంలో మునిగిపోయారు.
అమెరికాలో గతంలోనూ తెలుగు విద్యార్థులు కాల్పుల్లో మరణించాడు. సదర్న్ అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విశ్వశ్వేర రెడ్డి బేతి అనే విద్యార్థి అమెరికాలో ఏప్రిల్ 23వ తేదీన మరణించాడు. గ్రాడ్యుయేషన్ చదవడానికి అతను 2013లో అమెరికా వెళ్లాడు. అతను తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మనోరాబాద్ గ్రామానికి చెందినవాడు.
గతంలో వరంగల్ విద్యార్థి..
కాన్సాస్‌లోని ఓ రెస్టారెంటులో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి శరత్ పైన గతంలో కాల్పులు జరిపారు. కూచిభోట్లను చంపిన ప్రదేశానికి 26 మైళ్ల దూరంలోనే శరత్ హత్య జరిగింది. శరత్ హైదరాబాదులోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ చేశాడు. శరత్ హత్యపై భిన్న కథనాలు వినిపించాయి. 30 డాలర్ల బిల్లును కట్టమని అడగడంతో దుండగుడు కాల్పులు జరిపాడని తెలుస్తోంది. దుండగుడు అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో 26 ఏళ్ల శరత్ కొప్పు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరత్ మృతి చెందాడు. మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేయడానికి శరత్ అమెరికా వెళ్లిన ఆరు నెలల అనంతరం ఇది జరిగింది.
గతంలోనే జో బైడెన్ అప్రమత్తం..
అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్తపాతాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఏకే 47, ఏకే 15 సహా.. తొమ్మిది రకాల వెపన్స్‌ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా తుపాకులను కొనుగోలు చేయవచ్చు అయితే ఈ వయస్సు నిబంధనను సవరించనున్నట్లు జో బైడెన్ గతంలోనే తెలిపారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే గన్స్ కొనుగోలు చేయగలరని అన్నారు. దీనిపై చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను కోరారు. హైకెపాసిటీ మేగజైన్స్‌లో 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపేలా బుల్లెట్స్‌ను నింపవచ్చని, వాటిని కూడా నియంత్రించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.