Home /News /crime /

A SHOCKING INCIDENT HAS COME TO LIGHT IN MADHYAPRADESH WHERE THE GIRL WHO HAVING A LOVE MARRIAGE WITH A DALIT YOUTH SSR

Shocking Incident: దళిత యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుందని ఈమె కన్నతండ్రి ఎక్కడికి తీసుకెళ్లి.. ఏం చేశాడంటే..

అమిత్, సాక్షి

అమిత్, సాక్షి

ప్రపంచం ఆధునికత వైపు పురోగమిస్తున్న ఈరోజుల్లో కూడా కులాల కట్టుబాట్లు కొన్నిచోట్ల ఇప్పటికీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కులాన్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తున్న వాళ్లు ఈ సమాజంలో ఉన్నారు.

ఇంకా చదవండి ...
    భోపాల్: ప్రపంచం ఆధునికత వైపు పురోగమిస్తున్న ఈరోజుల్లో కూడా కులాల కట్టుబాట్లు కొన్నిచోట్ల ఇప్పటికీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కులాన్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తున్న వాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. కులం కోసం ప్రాణం తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. కూతురు గానీ, కొడుకు గానీ కులాంతర వివాహం చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడుతున్న తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. కూతురు దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేయించిన మారుతి రావు ఉదంతం మనందరికీ తెలిసిందే.

    తాజాగా మధ్యప్రదేశ్‌లో కూడా కులాన్ని ప్రాణంగా భావించే ఓ యువతి తండ్రి తన కూతురు దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంగా ఆమెను నర్మదా నదికి తీసుకెళ్లి శుద్ధి పేరుతో ఏ తండ్రీ కూతురిని అవమానించని రీతిలో అవమానించాడు. ఆమె జుట్టు కత్తిరింపజేశాడు. ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను నదిలో విసిరిపారేసేలా చేశాడు. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే ఒకేఒక్క కారణంతో తనతో పాటు నలుగురు చూస్తుండగా కూతురికి ఓ తండ్రి చేసిన అవమానం ఇది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బీతల్ జిల్లా చోప్నా ప్రాంతానికి చెందిన సాక్షి యాదవ్ అనే యువతి, బీతల్ ప్రాంతానికి చెందిన అమిత్ అహిర్వార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయగా పెద్దలు వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు.

    ఇది కూడా చదవండి: Heartbreaking: ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ కుటుంబానికి ఇలాంటి రోజొకటి ఎందుకొచ్చిందో...

    అమిత్ దళిత సామాజిక వర్గానికి చెందిన అబ్బాయని, అతనిని పెళ్లి చేసుకునేందుకు తాను ఒప్పుకోనని సాక్షి యాదవ్ తండ్రి తెగేసి చెప్పాడు. దీంతో.. సాక్షి, అమిత్ గతేడాది ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. సాక్షి పెళ్లి సంగతి తెలిసి ఆమె తండ్రి రగిలిపోయాడు. కూతురిని బలవంతంగా తీసుకొచ్చి ఆమెకు శుద్ధి పేరుతో నర్మదా నదికి తీసుకెళ్లి అర్ధనగ్నంగా స్నానం చేయించాడు. ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను నదిలో పారేయమని చెప్పాడు. ఆ తర్వాత ఆమె జుట్టు కత్తిరించి గుండు గీయించాడు.

    ఇది కూడా చదవండి: BSF Jawan Wife: ఈమె భర్త ఒక జవాను.. కొన్ని రోజుల క్రితమే సెలవులపై ఇంటికొచ్చాడు.. ఇంతలోనే..

    దళిత యువకుడితో వెళ్లిన తన కూతురు పవిత్రురాలు కావాలనే ఇలా చేసినట్లు సాక్షి తండ్రి అడిగిన వాళ్లకు చెప్పాడు. అనంతరం.. రాజ్‌గడ్‌లో హాస్టల్‌లో ఉంచి సాక్షిని చదివిస్తున్నాడు. అక్టోబర్ 18న ఆమెను నర్మదా నదికి తీసుకెళ్లి ఇలా చేయగా.. అక్టోబర్ 28న సాక్షి తన భర్తను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి వెళ్లిపోయి బీతల్‌లో ఉన్న తన భర్తను కలుసుకుంది. మన కులానికి చెందిన మరో యువకుడితో పెళ్లి జరిపిస్తానని, అమిత్‌కు విడాకులు ఇవ్వాలని తన తండ్రి ఒత్తిడి చేస్తున్నాడని సాక్షి చెప్పింది. పోలీసులు కూడా తన తండ్రితో చేతులు కలిపి తమని విడదీయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని, తమను విడదీసే ప్రయత్నాలు మానుకుని తమ బతుకేదో తమను బతకనివ్వాలని ఈ పెళ్లి చేసుకున్న ప్రేమ జంట కోరుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ జంటకు మద్దతుగా పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bhopal, Crime news, Love marriage, Lovers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు