A SHOCKING INCIDENT HAS COME TO LIGHT FROM MUMBAI ANDHERI AND HERE 17 GIRLS WERE RESCUED IN THE SECRET ROOM OF A BAR SSR
కలుగులో ఎలుకలు కాదు.. సీక్రెట్ గదిలో నుంచి బయటకొస్తున్న అమ్మాయిలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు..
సీక్రెట్ గదిలో నుంచి బయటకొస్తున్న అమ్మాయిలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చీకటి పనులు గుట్టుగా సాగుతున్నాయి. మహిళలను ఒక ఆట వస్తువుగా చూస్తుండే కొందరు మగాళ్లు 17 మంది మహిళలతో డ్యాన్స్ బార్‌కు తీసుకొచ్చి తప్పతాగి చిందులేస్తున్న విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేశారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చీకటి పనులు గుట్టుగా సాగుతున్నాయి. మహిళలను ఒక ఆట వస్తువుగా చూస్తుండే కొందరు మగాళ్లు 17 మంది మహిళలతో డ్యాన్స్ బార్‌కు తీసుకొచ్చి తప్పతాగి చిందులేస్తున్న విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేశారు. సీక్రెట్ బేస్మెంట్లో ఈ చీకటి దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 17 మంది మహిళలను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని అంధేరీలో దీపా బార్ ఉంది. ఆ బార్లో కస్టమర్ల ఎదుట ఆడిపాడటానికి యువతులను, మహిళలను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నారన్న సమచారంతో పోలీసులు బార్‌పై రైడ్ చేశారు.
ఆ బార్ బాత్రూమ్స్లో, స్టోరేజ్ రూమ్‌లో, కిచెన్‌లో కూడా ఆ యువతులను దాచారేమోనని పోలీసులు వెతుకులాట సాగించారు. కొన్ని గంటల పాటు సెర్చ్ చేసినా ఎక్కడా డ్యాన్సర్లు కనిపించలేదు. ఆ బార్ మేనేజర్‌ను, క్యాషియర్‌ను, వెయిటర్స్‌ను కూడా పోలీసులు విచారించారు. అయినప్పటికీ తమ బార్లో అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం లేదని, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని బుకాయించారు. కానీ.. పోలీసులకు బార్‌లోని మేకప్ రూంలో ఉన్న పెద్ద మిర్రర్‌ను చూస్తే అనుమానమొచ్చింది. అంత పెద్ద మిర్రర్ వెనుక పెద్ద కథే నడుస్తుందని పోలీసులకు అర్థమైంది. ఆ పెద్ద అద్దాన్ని బద్ధలుకొట్టి చూడగా.. లోపల ఓ సొరంగం లాంటి గది కనిపించింది. ఆ గదిలోకి వెళ్లి చూడగా బార్ యాజమాన్యం గుట్టంతా బయటపడింది. కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఈ సీక్రెట్ గదిలో నుంచి 17 మంది యువతులు బయటకు రావడంతో పోలీసులు షాకయ్యారు.
ఇలా రైడ్స్ జరిగినా అమ్మాయిలు ఎవరి కంటా పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు విచారణలో తెలిసింది. పలుమార్లు రైడ్స్ జరిగినప్పటికీ ఎప్పుడూ ఈ అద్దం వెనక ఉన్న రూం గురించి ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు ఈ రహస్య గది గురించి పోలీసులు కనిపెట్టారు. మోడ్రన్ డ్రస్సుల్లో ఉన్న యువతులు ఆ గదిలో నుంచి ఒక్కొక్కరుగా బయటకొచ్చారు. ఆ యువతులు ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అమ్మాయిలను తీసుకొచ్చి వారితో అర్ధనగ్న డ్యాన్సులు చేయిస్తూ.. వారిపై బార్‌కు వెళ్లిన కస్టమర్లు డబ్బులు చల్లే నీచమైన చీకటి వ్యవహారం సాగుతున్నట్లు పోలీసులు తేల్చారు.
ఇదిలా ఉండగా.. ఆ అద్దం వెనక ఉన్న రూంకు డోర్ కూడా ఉంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో ఆ డోర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రిమోట్ ఉంటేనే డోర్ ఓపెన్ అవుతుంది. ఆ గది కూడా సకల సౌకర్యాలతో ఉండటం కొసమెరుపు. ఆ గదిలో బెడ్స్, ఏసీ అన్నీ ఉన్నాయి. దీంతో.. ఆ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.