Oyo: ఆ ఓయో హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం.. వెళ్లి చూస్తే ఏముంది..

ఓయోలో పట్టుబడిన యువకులు, సోనిపట్ దాబాలో పట్టుబడిన యువతి

గ్రేటర్ నోయిడాలోని ఓ ఓయో హోటల్‌లో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సెక్టార్-36లోని గ్రీనో కాంప్లెక్ల్స్‌లో ఉన్న ఓయో హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు.

  • Share this:
    నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఓ ఓయో హోటల్‌లో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సెక్టార్-36లోని గ్రీనో కాంప్లెక్ల్స్‌లో ఉన్న ఓయో హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్స్‌లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు పురుషులు కాగా.. మరొకరు ఫరీదాబాద్‌కు చెందిన యువతి కావడం గమనార్హం. ఆ ఇద్దరు పురుషుల్లో ఒకరిది గ్రేటర్ నోయిడా కాగా.. మరొకరిది బులంద్‌షార్‌లోని సికింద్రాబాద్‌గా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.6900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్ ఆపరేటర్ రిషి గోయల్‌ను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదే హోటల్‌లోని గదుల్లో పలువురు యువతీయువకులు అనుమానాస్పద స్థితిలో కనిపించారని.. వారిని కూడా విచారిస్తున్నామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. నోయిడాలో కొన్ని రోజుల క్రితమే ఓ గెస్ట్ హౌస్‌లో కూడా సెక్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

    నోయిడాలోని పలు ఓయో హోటల్స్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. త్వరలోనే వ్యభిచార ముఠాల పనిపడతామని పోలీసులు చెప్పారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో కూడా వ్యభిచార దందా విచ్చలవిడిగా సాగుతోంది. సోనిపట్ పరిధిలోని ముర్తాల్ పరిసర దాబాల్లో వ్యభిచారం, గ్యాంబ్లింగ్ యధేచ్చగా సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దాబాలపై పోలీసులు దాడులు జరుపగా.. మొత్తం 12 మంది యువతులు, 12 మంది యువకులు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. మరో 9 మంది గ్యాంబ్లింగ్‌ ఆడుతూ పట్టుబడ్డారు.

    ఇది కూడా చదవండి: Mother: భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్న కూతురు గంటలుగంటలు ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమె తల్లికి తెలియడంతో..

    డీఎస్పీ అజిత్ సింగ్ ఆధ్వర్యంలో ఆరు దాబాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. అర్ధరాత్రి సమయంలో సోనిపట్, ముర్తాల్ ప్రాంతాల్లోని దాబాల్లో విచ్చలవిడిగా వ్యభిచారం, గ్యాంబ్లింగ్ కొనసాగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. డీఎస్పీ అజిత్ సింగ్ నేతృత్వంలో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దాబాలపై ఏకకాలంలో రైడ్స్ చేశారు. 12 మంది యువతులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. వీరిలో.. తొమ్మిది మంది ఢిల్లీకి చెందిన వారు కాగా.. ఉజిబెకిస్తాన్, టర్కీ, రష్యాకు చెందిన ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. గ్యాంబ్లింగ్ ఆడుతూ పట్టుబడిన యువకుల నుంచి రూ.1.63 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
    Published by:Sambasiva Reddy
    First published: