హైదరాబాద్‌లో వ్యభిచార గృహాలు.. భార్యభర్తలిద్దరూ కలిసి..

షేక్ ఫహద్ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

news18-telugu
Updated: June 19, 2019, 6:59 AM IST
హైదరాబాద్‌లో వ్యభిచార గృహాలు.. భార్యభర్తలిద్దరూ కలిసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముస్లిం జంటను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు షేక్ ఫహద్ అలియాస్ మదన్ (37), అతని భార్య సలీమా రబ్బాయి షేక్(27)గా గుర్తించిన పోలీసులు వీరు బంజారాహిల్స్ రోడ్ నంబరు. 12లోని సాయిబాబా గుడి వద్ద ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.3 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, స్విఫ్ట్ కారుతో మరో కారును స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఫహద్ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఫిల్మ్‌నగర్ రోడ్ నంబరు.5 లో రూ.75 వేలకు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో వ్యభిచార గృహం నిర్వహించడమే కాకుండా, కొంత కాలంగా డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నారని తెలిపారు.


First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>