కోరిక తీర్చలేదని ప్రేయసిని, ఇద్దరు పెళ్లాలనూ... తండ్రిని, మామను కూడా...

ఒంటరిగా వెళ్తున్న మహిళపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన వ్యక్తి... నిందితుడిని అరెస్ట్ చేసి, దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి... కన్నతండ్రి, కట్టుకున్న భార్యలు, పిల్లనిచ్చిన మామలతో కలిసి ఐదుగురిని చంపినట్టు నిర్ధారణ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 9:06 PM IST
కోరిక తీర్చలేదని ప్రేయసిని, ఇద్దరు పెళ్లాలనూ... తండ్రిని, మామను కూడా...
ఐదుగురిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్
  • Share this:
ప్రియురాలిని కోరిక తీర్చమంటే తిరస్కరించింది. పెళ్లి చేసుకుని, హాయిగా కాపురం చేసుకుందామనుకుంటే... పెళ్లాలు గొడవలు చేయడం మొదలెట్టారు. తండ్రినీ అనుమానంతో చూడడం మొదలెట్టాడు... ఇలా తనకు కష్టం వచ్చిన ప్రతీసారి... దానికి కారణమైన వారిని చంపేశాడు అతను. ఓ ప్రేయసి, ఇద్దరు పెళ్లాలు, కన్నతండ్రి, పిల్లనిచ్చిన మామ... అతని చేతిలో దారుణహత్యకు గురయ్యారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన రాములు అనే 24 ఏళ్ల వ్యక్తి, అదే గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తన కోరిక తీర్చాలంటూ ఆమెను కోరాడు రాములు. దానికి మంగమ్మ ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా వెళ్తున్న ఆమెపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగమ్మ ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... రాములును అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే యువతిని పెళ్లి చేసుకున్న రాములు... కొన్నిరోజులు సజావుగా కాపురం చేసిన తర్వాత మనస్పర్థల కారణంగా ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి హత్య చేశాడు. ఆ విషయం బయటికి పొక్కకుండా అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు. ఆ తర్వాత స్పప్న అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు, తన తండ్రికి వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం కలిగింది రాములుకి. ఆ అనుమానంతో ఇద్దరినీ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసు కింద అరెస్ట్ అయిన రాములు... జైలుకి వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మంజుల అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. భార్యా, తండ్రిని చంపిన రాములుతో పెళ్లికి మంజుల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె పేరటి పొలం రాశాడు. పెళ్లి కాగానే మాయమాటలు చెప్పి, పొలాన్ని అమ్మేశాడు. దానికి మంజుల తండ్రి ఒప్పుకోకపోవడంతో అతనికి ఫుల్లుగా తాగించి, బండరాయితో కొట్టి చంపేశాడు. తన తండ్రిని భర్తే చంపి ఉంటాడని అనుమానించిన మంజుల... అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో కొన్నాళ్లుగా మంచిగా మెలిగి మంగమ్మతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆ చనువుతో కోరిక తీర్చమని అడిగితే ఆమె ఒప్పుకోలేదు. మొదటి భార్యను హతమార్చినట్టే మంగమ్మను కూడా కిరోసిన్ పోసి, నిప్పు పెట్టి చంపేశాడు. ఐదు హత్యలు చేసిన రాములుపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

First published: March 30, 2019, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading