Shocking: అమ్మో.. ఇదెక్కడి ఘోరం.. వీడియో చూస్తుంటేనే ఏదోలా అనిపించింది.. ఓ తాగుబోతు కిరాతకం ఇది..

ఘటనకు సంబంధించిన దృశ్యం

మద్యం తాగితే మనిషి విచక్షణ కోల్పోతాడని అంటుంటారు. తాగిన మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అత్యాచారాలకు, చివరికి ఒక మనిషిని చంపేందుకు కూడా వెనుకాడరు. ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో అలాంటి అమానుష ఘటనే వెలుగుచూసింది. తాగిన మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు.

 • Share this:
  ఢిల్లీ: మద్యం తాగితే మనిషి విచక్షణ కోల్పోతాడని అంటుంటారు. తాగిన మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అత్యాచారాలకు, చివరికి ఒక మనిషిని చంపేందుకు కూడా వెనుకాడరు. ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో అలాంటి అమానుష ఘటనే వెలుగుచూసింది. తాగిన మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. రోడ్డు పక్కన చిన్న దుకాణం నడుపుకుంటున్న ఓ మహిళను నడిరోడ్డుపై హత్య చేశాడు. బీడీ అడిగితే ఆమె ఇవ్వలేదన్న కారణంతో తాగిన మైకంలో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా ‘ఎంత దారుణానికి ఒడిగట్టాడు’ అనే భావన రాక మానదు.

  ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ద్వారకా జిల్లాలోని దబ్రి అనే ప్రాంతంలో విభ అనే ఓ 30 మహిళ తన భర్తతో కలిసి ఇంటికి దగ్గర్లో రోడ్డు పక్కన చిన్న దుకాణం నడుపుకుంటూ జీవిస్తోంది. నిత్యావసరాలతో పాటు కూరగాయలు కూడా అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో సంతోషంగా ఆమె జీవితం గడిచిపోతోంది. కానీ.. తన జీవితంలో ఇలాంటి ఒకరోజు వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేకపోయింది. ఆమె ఇంటికి సమీపంలోనే దీపక్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ప్లంబర్‌గా పనిచేస్తుండే దీపక్ పెద్ద తాగుబోతు. రోజూ పనికెళ్లడం.. ఆ వచ్చిన డబ్బుతో తాగడం. ఇదే అతని నిత్యకృత్యం. తాగిన మత్తులో అందరితో తప్పుగా ప్రవర్తించేవాడు.  దీంతో.. ఆ ప్రాంతంలో దీపక్‌ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. అలాంటి దీపక్ గత ఆదివారం కూడా రాత్రి సమయంలో పూటుగా మద్యం తాగి మత్తులో తూలుకుంటూ తన ప్లంబర్ పనికి సంబంధించిన సామాగ్రితో ఇంటికి వెళుతున్నాడు. ఇంటికి వెళ్లేవాడు వెళ్లకుండా దారి మధ్యలో విభ దుకాణం దగ్గర ఆగాడు. ఆ దుకాణంలో ఆ సమయంలో విభ ఉంది. ఏం కావాలని అతనిని అడగ్గా.. బీడీలు అడిగాడు. లేవని విభ చెప్పడంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. అతనిని కొడతానని విభ ఓ కర్ర తీసుకుని బెదిరించింది. ‘రా కొట్టు.. కొట్టు’ అంటూ తాగిన మత్తులో దీపక్ నానా యాగీ చేశాడు. అంతటితో ఆగలేదు. తిరిగి వెళుతున్నట్టుగా కొంతదూరం వెళ్లి అతని సామాగ్రి బాక్స్‌ను తెరిచి.. అందులో నుంచి ఓ పదునైన ఆయుధం తీసి ఆమె దగ్గరకు వెళ్లి మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

  ఇది కూడా చదవండి: HR Manager: మూడేళ్ల నుంచి హెచ్‌ఆర్‌గా ఉద్యోగం.. మూడు రోజుల క్రితమే ఉద్యోగం మానేసింది.. పాపం ఇంతలోనే..

  ఆమెను రోడ్డు మీదకు లాక్కొచ్చి తన దగ్గరున్న పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు. తీవ్రంగా గాయపడిన విభ కుప్పకూలి కింద పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. ఆమెను పట్టించుకోకుండా ఏం జరగనట్టు దీపక్ తన బాక్స్ తీసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికులు వెళ్లిపోతున్న అతనిని గమనించి పట్టుకుని చితకబాదారు. విభను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు దీపక్ కూడా గాయపడటంతో అతనిని పోలీసులు దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే.. నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఊహించని ఈ హత్య ఘటనతో దబ్రి ప్రాంతం ఉలిక్కిపడింది. స్థానికులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: