Porn Link School whatassp group: గురువంటే దైవం.. తండ్రిలాంటి వాడు.. ఆ గురువు కూడా విద్యార్థులను (Students) కన్న బిడ్డల్లా భావించాలి.. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావి పౌరులుగా తీరిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది (Teachers).. కానీ ఇటీవల ఆ పదానికి అర్థమే మార్చేస్తున్నారు కొందరు కామాంధులు. చిన్నారులకు మంచి చెడ్డలు నేర్పించాలి.. ఏది తప్పు.. ఏది ఒప్పు అర్థమయ్యేలా చెప్పాలి.. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే వారిని పెడదోవ పట్టకుండా సన్మార్గంలో పయనించేలా చూడాలి. అలా చేస్తారు కాబట్టి.. ఉపాధ్యాయ వృత్తికి ప్రతి ఒక్కరో ఎంతో గౌరవం ఇస్తారు.. కానీ ఇటీవల కాలంలో కొందరు గురువులు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోవడంతో.. మంచి చెడులు ఆలోచించడం లేదు. పవిత్రమైన వృత్తిలో ఉండి నీచమైన పనులు చేస్తున్నారు. ఆ హోదాకే కళంకం తెచ్చి పెడుతున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు ఓ లింకును ఐదో తరగతి విద్యార్థుల వాట్సప్ గ్రూపు (Whatas app) పులో లింకు పెట్టాడు.
మహారాష్ట్రలోని రీవా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాల కె ఉపాధ్యాయుడి గా ఉన్న కృపాకర్ చతుర్వేది 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో లింక్ ను షేర్ చేశాడు. దీంతో ఆ లింకు ఓపెన్ చేసిన చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. కాసేపటికే తేరుకుని ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. చిన్నారుల వాట్సప్ కు అలాంటి వీడియోలు పప షాక్ తిన్నారు.
ఇదీ చదవండి : ఒడిషాలో హీటెక్కిన రాజకీయం.. బీజేవైఎం ఆందోళనలు ఉధృతం.. సీఎం కాన్వాయ్‌పై దాడి
ఈ వ్యవహారాన్ని వారు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. లింక్ ను షేర్ చేసిన టీచర్ కృపాకర్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ గ్రూప్ లో జిల్లాలోని సుమారు 28 పాఠాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళా టీచర్లు ఉన్నారు. అయినా నిస్సిగ్గుగా అలాంటి లింకును షేర్ చేశారు.
ఇదీ చదవండి : 5G కన్నా ముందే వస్తున్న 6G.. ప్రత్యేకత ఏంటి..? ఇండియాకు ఎప్పుడు వస్తుంది..?
అయితే అప్పటికే దుమారం రేగడంతో వెంటనే టీచర్ అలార్ట్ అయ్యాడు. ఆశ్లీల లింక్ షేర్ చేసిన కాసేపటికే టీచర్ కృపాకర్ దాన్ని తొలగించాడు. సోషల్ మీడియా వేదికగా క్షమాణలు చెప్పాడు. అయితే కృపాకర్ ఇలా చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ చాలాసార్లు ఇలాంటి లింక్‌లు షేర్ చేశాడని గ్రూప్‌లోని మరో టీచర్ ఆరోపించారు. అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Students, Whatsapp