హోమ్ /వార్తలు /క్రైమ్ /

పరీక్షల్లో పాస్ కావాలంటే.. ఆయన ‘పక్క’లోకి వెళ్లాల్సిందే... ఓ కీచక టీచర్ నిర్వాకమిది..

పరీక్షల్లో పాస్ కావాలంటే.. ఆయన ‘పక్క’లోకి వెళ్లాల్సిందే... ఓ కీచక టీచర్ నిర్వాకమిది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థుల భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన ‘గురు’తర బాధ్యత ఉన్నవాళ్లు కూడా... ‘పక్క’దారులు తొక్కుతున్నారు. జీతాలు తీసుకుని బడిలోకి రావడ వంటి తమ వృత్తికి ద్రోహం చేయడం సంగతి అటుంచి.. వచ్చినా విద్యార్థినులపై అసభ్య ప్రవర్తనతో సమాజంలో నవ్వుల పాలవుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరాయ... ఈ సమాజం గురువుకు ఇచ్చిన స్థానమది. తల్లిదండ్రుల తర్వాత.. గురువునే దైవంగా భావించే వృత్తి అది. అలాంటి ఉపాధ్యాయులే.. తప్పుడు పనులు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన ‘గురు’తర బాధ్యత ఉన్నవాళ్లు కూడా... ‘పక్క’దారులు తొక్కుతున్నారు. జీతాలు తీసుకుని బడిలోకి రావడ వంటి తమ వృత్తికి ద్రోహం చేయడం సంగతి అటుంచి.. వచ్చినా విద్యార్థినులపై అసభ్య ప్రవర్తనతో సమాజంలో నవ్వుల పాలవుతున్నారు. సభ్య సమాజంలో గురువు అనే వృత్తికి ఉన్న ప్రతిష్టను గంగలో కలుపుతున్నారు. పరీక్షలో పాస్ కావాలంటే తన పక్కలో పడుకోవాలని అన్నాడు ఓ ఉపాధ్యాయుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజస్తాన్ లో చోటుచేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా నీమ్రానాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడి ఉన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న దేవ్ ప్రకాశ్ యాదవ్.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠాలు చెబుతున్న సమయంలో వారి దగ్గరకు వెళ్లి.. వారిని తాకరాని చోట తాకడం.. వారి భుజాల మీద చేతులు వేసి నలపడం వంటి పనులకు పూనుకున్నాడు. దీంతో అమ్మాయిలు బడిలోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయేవారు. వాళ్ల తల్లిదండ్రులతో చెప్పుకోలేక.. కీచక మాస్టారు గారి అసహ్యకరమైన చర్యలు తట్టుకొనే ఓపికలేక వారంతా మానసిక ఇబ్బందులు పడేవారు.

ఇదీ చదవండి.. Telangana: పంది మాంసం కుక్కకు పెట్టలేదని తోటి కార్మికుడిని చంపిన మనిషి...

ఇదే క్రమంలో ఆ కీచక టీచర్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇన్నాళ్లు వారిని అసభ్యంగా తాకిన ఆ ఉపాధ్యాయుడు.. వారిని తన దగ్గరికి పిలిపించుకుని... పరీక్షల్లో పాస్ కావాలంటే తనతో సఖ్యతగా ఉండాలని హెచ్చరించాడు. సఖ్యత అంటే గురు శిశ్యుల మధ్య ఉండేదనుకుంటే పొరపాటే. ఆయనగారి దృష్టిలో సఖ్యత అంటే.. విద్యార్థినులు సదరు గురువు గారితో గడపడం. అలా అయితేనే వారికి మార్కులు పడతాయి. పరీక్షల్లో పాస్ కావాలంటే.. సార్ పక్కలోకి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేశాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థినులు.. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ కీచక టీచర్ అరాచకాలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు అధికారులకు వివరించారు.

విద్యార్థుల ఫిర్యాదు మేరకు.. ఉన్నతాధికారులు కీచక టీచర్ మీద విచారణకు ఆదేశించారు. ఆరోపణలు రుజువు కావడంతో.. అతడిని పోలీసులకు అప్పగించారు. గత శనివారం అతడిని పోస్కో కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన ప్రత్యేక కోర్టు.. వచ్చే నెల 2 వరకు అతడిని కస్టడీకి పంపింది.

First published:

Tags: Crime, Crime news, Rajasthan, Teacher misbehave

ఉత్తమ కథలు