తెలంగాణ (Telangana)లోని యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ (Bus and Tractor collied)ను ఢీ కొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం (Four people died) చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. యాదాద్రి (Yadadri) జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉంది. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపో (Warangal depo)కు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన బస్సు ట్రాక్టర్‌ను, అక్కడే పని చేస్తున్న కూలీలను ఢీకొట్టింది.
ఈ ఘటనలో నలుగురు కూలీలు ఘటనా స్థలంలోనే చనిపోయారు (Four people were died). ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు . ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలె యాదాద్రిలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని అటుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. అయితే అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు మరో స్నేహితుని సోదరి వివాహం కోసం ఉదయం ఆలేరు వచ్చారు. వివాహం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు యదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం గూడూరు వద్దకు చేరుకున్న సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకటేశ్,రవి కిరణ్, కార్తీక్ రెడ్డి, కల్యాణ్ రెడ్డిలు కారులోనే ఇరుక్కుపోయారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో.. వారు పూర్తిగా అందులోనే చిక్కుకుపోయారు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటకు రాలేకపోయారు.ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే వారు నలుగురు మృతి చెందారు. ఇక, ఈ ప్రమాదంలో అఖిల్‌రెడ్డి, సాయిచరణ్, హర్షవర్దన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకుతరలించారు.
ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో అదే దారిలో వచ్చిన మరో కారు.. ప్రమాదానికి గురైన కారు ఢీకొట్టింది. అయితే రెండో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Telangana, Yadadri