ఉత్తర కొరియా కింగ్‌ కిమ్ తన సోదరుడ్ని తానే చంపించాడా?.. అదే కారణం..!

నామ్ హత్యకు కారణమెవరు? ఎందుకు హత్య చేయించారు? ఆయన చేసిన తప్పేంటి? అంటే ఆసక్తికర విషయం వెల్లడించాయి కొన్ని రిపోర్టులు. పైగా, స్వయంగా కిమ్.. తన సోదరుడి హత్యకు ఆదేశాలు జారీ చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 5:32 PM IST
ఉత్తర కొరియా కింగ్‌ కిమ్ తన సోదరుడ్ని తానే చంపించాడా?.. అదే కారణం..!
నామ్, కిమ్ సోదరులు
  • Share this:
అది 2017, ఫిబ్రవరి 13.. మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయం.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు నామ్‌పై ఇద్దరు యువతులు వీఎక్స్ విషంతో దాడి చేశారు.. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోపే ఆయన మరణించారు. మోతాదుకు మించిన వీఎక్స్‌ విషం ప్రయోగించడంతో నేరుగా అతడి గుండెపై ప్రభావం చూపి అనంతరం ఊపరితిత్తులు.. ఇలా శరీరంలోని ప్రధాన భాగాలపై, తదనంతరం మొత్తం శరీరంపై ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేసింది. మొత్తం నాడీ వ్యవస్థను కొద్ది సెకన్లలోనే ఒక్కసారిగా కుప్పకూల్చింది. ఆ కేసులో వియాత్నాంకు చెందిన ఓ మహిళతో పాటు ఇండోనేసియాకు చెందిన మరో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే, నామ్ హత్యకు కారణమెవరు? ఎందుకు హత్య చేయించారు? ఆయన చేసిన తప్పేంటి? అంటే ఆసక్తికర విషయం వెల్లడించాయి కొన్ని రిపోర్టులు. పైగా, స్వయంగా కిమ్.. తన సోదరుడి హత్యకు ఆదేశాలు జారీ చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన సీఐఏ ఏజెంట్ నామ్ అని, ఆయన ఉత్తర కొరియా రహస్య సమాచారాన్ని ఆ నిఘా సంస్థకు చేరవేశారని ఓ మీడియా రిపోర్టు తెలిపింది. ఆయన చనిపోయే రోజు కూడా సీఐఏ అధికారిని కలవడానికి వెళ్లారని, ఈ క్రమంలో దాడి చేసి చంపేశారని వెల్లడించింది.

అయితే, సీఐఏకు, నామ్‌కు మధ్య సంబంధంపై ఎలాంటి సమాచారం అందించలేదు ఆ రిపోర్టు. నామ్ ఎక్కువగా ఉత్తర కొరియాకు ఆవలే గడిపేవారని, ఈ క్రమంలో దేశంలోని విషయాలను సీఐఏకు చేరవేస్తుండేవారని ఆ రిపోర్టు పేర్కొంది. కాగా, ఉత్తర కొరియా అధికారులే నామ్ హత్యకు ఆదేశాలు జారీ చేశారని దక్షిణ కొరియా, అమెరికా అధికార వర్గాలు ఆరోపించాయి. వీటిని ఉత్తరకొరియా ఖండించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 11, 2019, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading