A PSYCHO KILLED TWO PERSONS WITH IN MINUTES WITHOUT REASON IN MUMBAI VRY
Psycho murders : రోడ్డు మీద పోతూనే.. మర్డర్స్ చేస్తాడు.. ఇలా నిమిషాల వ్యవధిలో ఇద్దరి హతం...!
Psycho murders : రోడ్డు మీద పోతునే.. మర్డర్స్ చేస్తాడు..
Psycho murders : దారివెంట వెళుతూనే.. రోడ్డు మీద పడుకున్న వ్యక్తులను అకారణంగా హత్య చేస్తాడు.. అలా నిమిషాల వ్యవధిలోనే ఇద్దరిని చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆ నిందితుడు గతంలో కూడా ఇలా హత్య చేసి జైలుకు వెళ్లిరావడం గమనార్హం.
సైకోలు ( Psycho murders )ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు.. ఎందుకు చేస్తారో కూడా తెలియదు. కాని వారి తీరుతో అమాయకుల ప్రాణాలు అప్పనంగా గాల్లో కసిపోతాయి.. వారిని ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా సైకోల తీరు ఉంటుంది. అది ఒక్కోసారి జుగుప్సకరంగా ఎవ్వరు ఉహించని విధంగా ఉంటుంది. అలాంటీ సంఘటనే ఒకటి ముంబైలో వెలుగు చూసింది. కేవలం క్షణాల వ్వవధిలోనే రోడ్డుమీద పడుకున్న ఇద్దరిని అకారణంగా బండరాయితో మోది ఓ సైకో హత్య ( Psycho murders )చేశాడు. దీంతో హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రాలో (Maharshtra ) ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన సురేష్ గౌడ అనే వ్యక్తి తన కుటుంబానికి దూరంగా ముంబయికి వచ్చి కూలి పనులతో పాటు చెత్త ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ నెల 23న ముంబయిలోని జేజే మార్గ్‌లోని రోడ్డు వెళుతుండగా ఫుట్‌పాత్‌పై పడుకున్న వ్యక్తిని చూశాడు. అంతే రోడ్డుపై వెళుతున్న సురేశ్ గౌడకు ఒక్కసారిగా తన సైకోయిజం బయటపడింది. ఎలాంటీ కవ్వింపు చర్యలు లేకుండానే రోడ్డుమీద పడుకున్న వ్యక్తి తలపై పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మతో మోదాడు.. దీంతో తలపగిలిన వ్యక్తి అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు.
దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ( cc camera ) ఆధారంగా సురేశ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టడడంతో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి.. తమ విచారణలో ఆ సైకో మరో విషయం చెప్పాడు.. రోడ్డు మీద పడుకున్న వ్యక్తి హత్య కంటే పదిహేను నిమిషాల ముందే మరో వ్యక్తి కూడా అలాగే బండరాయితో మోది హత్య ( Psycho murders )చేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. అంతేకాదు ఆ సైకో గతంలో కూడా ఓ వ్యక్తి హత్య చేసి జైలుకు వెళ్లినట్టు గుర్తించారు. కాని ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడనే అంశాన్ని రాబట్టలేక పోయారు.( Psycho murders )హత్యలు ఎందుకు చేస్తున్నానే విషయం నిందితుడు వెళ్లడించకపోవడంతో సైకోను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంకా ఇలాంటీ హత్యలు ఏవైనా చేశాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు స్థానిక ముంబయి పోలీసులు తెలిపారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.