హోమ్ /వార్తలు /క్రైమ్ /

అతడు ప్రైవేట్ టీచర్.. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు నటించాడు.. స్నేహితుడి రూంకి తీసుకెళ్లి..

అతడు ప్రైవేట్ టీచర్.. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు నటించాడు.. స్నేహితుడి రూంకి తీసుకెళ్లి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Private Teacher: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారానే విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ఆసరా చేసుకుని ఓ ప్రైవేట్ టీచర్ ఏకంగా ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారానే విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ఆసరా చేసుకుని ఓ ప్రైవేట్ టీచర్ ఏకంగా ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించాడు. ఆన్లైన్ ట్యూషన్ చెబుతానంటూ పరిచయమైన ఓ ప్రైవేటు టీచర్ 14 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగానూ లొంగదీసుకున్నాడు. చివరికి వివాహం చేసుకుందామని హైదరాబాద్ తీసుకెళ్లిన అతని ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ బాలిక తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై ఫోక్స్ కేసు నమోదైంది. అంతేకాక అతని బాధితులు మరికొంత మంది ఉన్నట్లు అనుమానాలు ఉండటంతో పోలీసులు ఆ దిశగాను విచారణ చేస్తున్నారు. బాధిత బాలిక కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహేష్ అనే ప్రైవేట్ టీచర్ గతేడాది సెప్టెంబర్ నెలలో స్నేహితుల ద్వారా పరిచయం అయ్యాడు. ఆన్లైన్లో ట్యూషన్ చెబుతానంటూ పరిచయం చేసుకుని తర్వాత ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని వెంబడించాడు.

అతని మాటలు నమ్మిన ఆ విద్యార్థినికి తన ఇబ్బందులు చెప్పి పలుమార్లు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అతని స్నేహితుడి గదికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగానూ వాడుకున్నాడు. ఇటీవల పారిపోయి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో ఇద్దరు కలిసి దిగిన ఫోటో లను సామాజిక మధ్యమాలో పెడతానని బెదిరించి స్నేహితుల సాయంతో గత వారం హైదరాబాదు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను ఓ హాస్టల్లో ఉంచి ప్రతిరోజు వెళ్లి కలిసేవాడు. ఈ క్రమంలో మహేష్ తాను వేరే అమ్మాయిని ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విద్యార్థిని తాను మోసపోయానని గ్రహించి తిరిగి జడ్చర్లకు వచ్చేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు మహేష్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు.

అయితే గతంలోనూ కొందరు విద్యార్థినులతో అతను ఇలాంటి వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. అయితే దీంట్లో ప్రముఖంగా గ్రామ కార్యదర్శి సహకరించినట్లు సమాచారం. వీటిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు జడ్చర్ల సీఐ వీరస్వామి తెలిపారు. మహేష్ అనే వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నామని అన్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

First published:

Tags: Crime, Crime news, Lover, Lovers, Mahabubnagar, Private teachers, Telangana crime news

ఉత్తమ కథలు