A PRIVATE SCHOOL PRINCIPAL BOOKED FOR RAPING CLASS 9 GIRL STUDENT IN SHAMIRPET AT HYDERABAD OUTSKIRTS MKS
Shamirpet : మాస్క్ పెట్టుకోలేదని.. 9th విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారం.. ఓ పార్టీ అండతో
ప్రతీకాత్మక చిత్రం
కరోనా సమయంలో మాస్క్ పెట్టుకోకుండా స్కూల్ కు ఎందుకు వచ్చావంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినినిపై చిందులేశాడు ప్రిన్సిపల్. పనిష్మెంట్ ఇస్తానంటూ గదిలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడు. నాటకీయ పరిణామాల మధ్య విషయం బయటికి రావడంతో ఓ రాజకీయ పార్టీ అతనికి అండగా బాధిత కుటుంబంతో బేరాలకు దిగింది. హైదరాబాద్ శివారు శామీర్ పేట్ లో చోటుచేసుకున్న ఉదంతమిది..
కరోనా సమయంలో విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ బడులకు వెళుతున్నారు. కొవిడ్ ప్రొటోకాల్స్ విధిగా అమలు చేయాల్సిన పరిస్థితిలో స్కూల్ యాజమాన్యాలు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే దీన్నొక సాకుగా తీసుకొని విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రిన్పిపల్. మాస్కు పెట్టుకోలేదనే సాకుతో తొమ్మిదో తరగతి బాలికను గదిలోకి పిలిపించుకున్న హెడ్ మాస్టర్ కీచకానికి ఒడిగట్టాడు. నాటకీయ పరిణామాల మధ్య వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు శామీర్ పేట్ లో చోటుచేసుకుంది. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సుధీర్ కుమార్ చెప్పిన వివరాలివి..
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని శామీర్ పేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూలులో విద్యార్థిని (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈనెల 22న యథావిధిగా స్కూలుకు వెళ్లిన ఆమె పొరపాటున మాస్కును ముఖానికి పెట్టుకోకుండా బ్యాగ్ లోనే ఉంచేసుకుంది. మాస్క్ లేకుండా కనిపించిన విద్యార్థినిపై ప్రిన్సిపల్ ఆగ్రహించారు. తన గదికి రావాల్సిందిగా ఆదేశించడంతో విద్యార్థిని భయంతోనే ప్రిన్సిపల్ రూమ్ కు వెళ్లింది..
మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు.. అందాన్ని చూపించడానికేనా.. అంటూ వికృత పదజాలంతో విద్యార్థినిని భయపెట్టాడు స్కూల్ ప్రిన్సిపల్. ఈ విషయంలో అవసరమైతే ఎంతవరకైనా పోతానంటూ బెదిరించాడు. వణికిపోతోన్న ఆ విద్యార్థినిని బలవంతంగా దగ్గరికి లాక్కొని ఆఫీసు గదిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు కీచక ప్రిన్సిపల్. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక కొద్దిరోజులపాటు మౌనంగా ఉండిపోయింది. అయితే..
నిన్న బుధవారం బాలిక స్కూల్ నుంచి తిరిగొస్తుండగా గతంలో అదే పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసిన మహిళా టీచర్ తారాసపడింది. ఓల్డ్ స్టుడెంట్ కావడంతో ఆ పాపను పలకరించింది మాజీ ప్రిన్సిపల్. కుశల ప్రశ్నల తర్వాత బోరున విలపిస్తూ టీచర్ ను గట్టిగా పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేసిందా అమ్మాయి. విద్యార్థిని తీరుకు విస్తుపోయిన మాజీ ప్రిన్సిపల్ అసలేమైందో ఆరా తీయగా, జరిగిన దారుణాన్ని చెప్పిందా పాప. మాజీ ప్రిన్సిపల్ ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. కానీ కీచక ప్రిన్సిపల్..
స్కూల్లోనే 9వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ రేప్ చేసిన విషయం బయటికి పొక్కడంతో ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు నిందితుడికి మద్దతుగా రంగంలోకి దిగారు. పరిహారం తీసుకొని కేసు వాపస్ తీసుకునేలా బాధిత బాలిక కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న మరో రాజకీయ పార్టీకి చెందిన నేతలు బాధిత కుటుంబానికి అడగా నిలబడటంతో ఎట్టకేలకు విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదుకాగా, ప్రిన్సిపల్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.