Home /News /crime /

A PREGNANT WOMAN WHO DIED AFTER WRITING A SUICIDE LETTER DEMANDING THAT HER HUSBAND NOT TOUCH HER DEAD BODY PRV

Hyderabad: నా శవాన్ని కూడా వాడు తాకొద్దు.. సూసైడ్​ నోట్​లో మూడు నెలల గర్భిణీ కన్నీటి వ్యథ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడని, అతడికి తన మృతదేహాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో రాసుకుంది

    అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన రాజధాని నగరం హైదరాబాద్​ (Hyderabad)లో జరిగింది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడని, అతడికి తన మృతదేహాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో (dairy) రాసుకుంది. కలకలం రేపిన ఈ ఘటన బాలాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్​లోని షాషీన్ నగర్ జుబైద్ కాలనీలో ఉండే దంపతులు ఖాజా మొహియుద్దీన్ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) ఏంబీఏ (MBA) చదివింది. చార్మినార్ (Charminar) ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్ పటేల్ (30)తో ఆమెకు గతేడా  ఫిబ్రవరిలో వివాహం (Marriage) అయ్యింది. అప్పటినుంచి ఆమె ఎవరితో మాట్లాడినా భర్త (Husband) అనుమానించేవాడు.. బెల్టు, కర్రలతో చితకబాదేవాడు. ఆడబిడ్డ భర్త , ఆమె కుమారులతో మాట్లాడినా విచక్షణారహితంగా కొట్టేవాడు. తన ప్రవర్తన గురించి పుట్టింట్లో లేదా మరెవరికైనా చెబితే రివాల్వర్ తో కాల్చి చంపుతానని బెదిరించేవాడు కిరాతకుడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు అందరికీ చూపిస్తానని హెచ్చరించేవాడు దుర్మార్గుడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావమైతే ఆనందపడ్డాడు కూడా (Husband).

    అర్థం చేసుకోని తల్లిదండ్రులు..

    ఆ కిరాతకుడు పెట్టిన చిత్రహింసలన్నీ ఫిర్దోస్ అన్సారీ (Firdous Ansari) తన డైరీలో రాసుకుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి కూడా. ఆమెను చిత్రహింసలు పెట్టి తల్లిదండ్రుల వద్దే ఉండాలని హెచ్చరిస్తూ గతనెలలో పంపించేశాడు భర్త. ఈ నెల 1న షాహిన్ నగర్ లోని అత్తగారింటికి వచ్చి భార్యను దుర్భాషలాడుతూ విచక్షణా రహితంగా కొట్టి మరీ వెళ్లిపోయాడు. ఇంతకాలం దాచిన తన భర్త నిజస్వరూపాన్ని పుట్టింటి వారికి వివరించి తనను కాపాడాలని వేడుకుంది ఫిర్దోస్ అన్సారీ . అయితే, తల్లిదండ్రులు మాత్రం భార్యాభర్తలన్నాక గొడవలుంటాయాని తేలిగ్గా తీసిపారేశారు. తరువాత మాట్లాడదాం అంటూ నచ్చజెప్పారు. ఇక ఫిర్దోస్ అన్సారీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్ధం చేసుకోలేని తల్లిదండ్రులు, ఆదరించని అత్తగారిల్లు ఇక బతికుండి ఏం లాభం అనుకుంది.



    ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడంది. వేధింపులకు తాళలేక చనిపోతున్నానని, భర్త, అత్తామామలు.. తన మృతదేహాన్ని తాకకుండా అడ్డుకోవాలని కోరింది. అదే తల్లిదండ్రులుగా మీరు నాకు చేసే మేలు అని డైరీలో రాసింది. తల్లి ఫిర్యాదు తో బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.

    20 శతాబ్ధంలో అడుగుపెట్టినా భార్యలను భర్తలు తీవ్రంగా కొడుతున్నారు. వారు పెట్టే హింస భరించలేక చాలా మంది మహిళలు తనువు చాలిస్తున్నారు. 100 మందిలో ఒకరో, ఇద్దరో మాత్రమే భర్తలు, అత్తింటి వారిపై పోలీసు కేసు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో వరకట్న వేధింపులు (Dowry harassment) భరించలేక ఓ మహిళ తనువు చాలించింది. ‘భర్త, అత్త వేధింపులు తట్టుకోలేను.. విడిపోయి ఒంటరిగా బతకలేను...అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇటీవలె ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Hyderabad, Pregnancy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు