హోమ్ /వార్తలు /క్రైమ్ /

Brutal Crime: ఇంత దగ్గరయిన వీళ్లను చూస్తుంటే ముచ్చటేస్తోందా.. ఏం జరిగిందో తెలిస్తే పాపం అనిపిస్తుంది..!

Brutal Crime: ఇంత దగ్గరయిన వీళ్లను చూస్తుంటే ముచ్చటేస్తోందా.. ఏం జరిగిందో తెలిస్తే పాపం అనిపిస్తుంది..!

ప్రగతి, రాహుల్ (ఫైల్ ఫొటో)

ప్రగతి, రాహుల్ (ఫైల్ ఫొటో)

హర్యానాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిపై.. గర్భవతి అని కూడా కనికరం లేకుండా ఆమెపై పెట్రోల్ పోసి చంపేందుకు ఓ యువకుడు యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ యువతి శరీరం దాదాపు 90 శాతం కాలిపోయింది. బాధితురాలు ఎనిమిది నెలల గర్భంతో ఉండటం గమనార్హం. ఈ ఘటనలో యువకుడికి కూడా 30 శాతం శరీరం కాలిపోయింది.

ఇంకా చదవండి ...

సోనిపట్: హర్యానాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిపై.. గర్భవతి అని కూడా కనికరం లేకుండా ఆమెపై పెట్రోల్ పోసి చంపేందుకు ఓ యువకుడు యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ యువతి శరీరం దాదాపు 90 శాతం కాలిపోయింది. బాధితురాలు ఎనిమిది నెలల గర్భంతో ఉండటం గమనార్హం. ఈ ఘటనలో యువకుడికి కూడా 30 శాతం శరీరం కాలిపోయింది. ఇద్దరినీ ఢిల్లీలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆ గర్భిణికి చికిత్స చేస్తున్న సమయంలో సహజ ప్రసవం ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన కొద్ది నిమిషాలకే ఆ బిడ్డ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రగతి అనే 20 ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దాదాపు రెండేళ్లుగా వాళ్లిద్దరూ రాహుల్ ఇంట్లోనే ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. ప్రగతిని రాహుల్ పెళ్లి చేసుకోలేదు. కానీ.. పలుమార్లు ఆమెతో శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలోనే ప్రగతి గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకోవాలని రాహుల్ సూచించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. అప్పటి నుంచి రాహుల్, అతని తల్లి నుంచి ప్రగతికి వేధింపులు మొదలయ్యాయి. ప్రగతిని వేధించసాగారు.

బిడ్డ పుట్టగానే చంపుతామని రాహుల్, అతని తల్లి ప్రగతిని బెదిరించారు. అబార్షన్ చేయించుకోవాలని చెప్పినా ప్రగతి వినిపించుకోవడం లేదని ఆమెపై కక్ష పెంచుకున్న రాహుల్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ప్రగతి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 1 గంట సమయంలో రాహుల్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు నిప్పంటించిన క్రమంలో రాహుల్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రగతి ఆ బాధ తట్టుకోలేక కేకలేసింది. అర్ధరాత్రి అరుపులు, కేకలు వినిపించడంతో ఏం జరిగిందోనని ఇరుగుపొరుగు చూడగా మంటల్లో కాలిపోతూ ప్రగతి కనిపించింది. వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే ఆమె శరీరం దాదాపుగా కాలిపోయింది. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రగతిని, గాయపడిన రాహుల్‌ను ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Couple: లాడ్జిలో రూం తీసుకుని మరీ ఎందుకిలా చేశారో.. ఈ కుర్రాడు ఫోన్ చేసి విషయం చెప్పాడు.. అక్కడికి వెళ్లేలోపే..

ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించి రాహుల్ వాదన పూర్తి భిన్నంగా ఉంది. ప్రగతిపై తాను పెట్రోల్ పోయలేదని, ఆమెనే ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని.. ఆమెను కాపాడే క్రమంలో తనకూ గాయాలయ్యాయని చెప్పుకొచ్చాడు. ప్రగతి వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్రంగా గాయపడిన ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో ఆమె స్టేట్‌మెంట్‌ను తీసుకోలేకపోయారు. అర్ధరాత్రి సమయంలో రాహుల్, ప్రగతి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ గొడవ కారణంగా పట్టరాని కోపంతో ఊగిపోయిన రాహుల్ ప్రగతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రాహుల్‌పై, అతని తల్లిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Brutally murder, Crime news, Haryana, Lovers, Murder attempt

ఉత్తమ కథలు