అర్ధరాత్రి పెంపుడు పిల్లి తెగ అరుస్తుందని లేచి చూస్తే... షాక్‌...

పార్టీకి వెళ్లిన ఫుల్లుగా మందేసి, మత్తుగా ఇంటికి వచ్చి పడుకున్న భార్యాభర్త... యాసిడ్ లీక్ కావడంతో ఇళ్లంతా నిండుకున్న కార్బన్ మోనాక్సైడ్... వాసనను పసిగట్టిన పిల్లి అరుపులతో తప్పిన పెను ప్రమాదం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 6, 2019, 8:00 PM IST
అర్ధరాత్రి పెంపుడు పిల్లి తెగ అరుస్తుందని లేచి చూస్తే... షాక్‌...
పెంపుడు పిల్లి (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 6, 2019, 8:00 PM IST
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే మానసికంగా ఎన్నో లాభాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పెంపుడు పిల్లల కారణంగా మానసిక ఒత్తిడి మాయమై, మానసిక ఉత్తేజం పెరుగుతుందని చెబుతారు. అయితే పెంపుడు పిల్లి కారణంగా ఓ జంట ప్రాణాలు నిలిచాయి. అర్ధరాత్రి పిల్లి అరుస్తుండడంతో ఏమైందోనని లేచి చూసిన వారికి... అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని డెల్టానా ఏరియాలో పాల్, అతని భార్య లీనా జోన్స్ కలిసి నివసిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఓ పార్టీకి వెళ్లిన ఈ ఇద్దరూ... ఫుల్లుగా మందేసి, మత్తుగా ఇంటికి వచ్చి పడుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో మత్తుగా నిద్రపోయారు. వారి ఇంటి పక్కనే గ్యారేజ్ ఉండడంతో అక్కడున్న ఓ బాటిల్ నుంచి యాసిడ్ లీక్ అవ్వడం మొదలైంది. కొద్ది కొద్దిగా లీక్ అవుతూ... గ్యారేజ్ అంతా కార్బన్ మోనాక్సైడ్‌తో నిండిపోయింది. ఆ వాసనను పసిగట్టిన పిల్లి... అరవడం మొదలెట్టింది. ఆగకుండా అరుస్తూనే ఉన్న పిల్లి అరుపులకు డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయిన లీనా జోన్స్ నిద్రలేచి వచ్చి, ఎందుకు అరుస్తుందోనని చూసింది.

అప్పటికే ఇళ్లంతా కార్బన్ మోనాక్సైడ్‌ నిండుకోవడంతో అసలు విషయం గ్రహించి, షాక్‌కు గురైంది. అప్పటికే కార్బన్ మోనాక్సైడ్ కారణంగా ఆమె భర్త పాల్ మెల్లిమెల్లిగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడని గ్రహించింది లీనా. వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన ఆమె... అగ్నిమాపక సిబ్బందికీ, అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చి... పాల్‌ను ఆసుపత్రికి తరలించారు. కార్బన్ మోనాక్సైడ్ మోతాదు కారణంగా వారి పెంపుడు పిల్లి ఆరోగ్యం బాగా దెబ్బతింది. పిల్లి అరవకపోయి ఉంటే, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని చెప్పింది లీనా జోన్స్. తమ ప్రాణాలు కాపాడిన పెంపుడు పిల్లి, త్వరగా కోలుకోవాలని ఆమెతో పాటు సోషల్ మీడియాలో వార్త చదివిన వారందరూ కోరుకుంటున్నారు.

First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...