Home /News /crime /

A PAN SHOP OWNER ATTACKED FAST FOOD MAN WITH KNIFE WHO REJECTED TO SUPPLY FAST FOOD TO HIM AT NIGHT IN HYDERABAD PRV

Hyderabad: హైదరాబాద్​లో దారుణం.. ఫాస్ట్​ఫుడ్ లేదన్నాడని ఛాతిలో కత్తితో దాడి..  ప్రాణాపాయ స్థితిలో యువకుడు

 (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

అప్పటివరకు స్నేహితుల్లా మాట్లాడుకున్న వాళ్లే బద్ద శత్రువులైపోతారు. కొన్ని సార్లైతే చంపేసుకోవడం వరకూ దారి తీయొచ్చు. ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో ఒకటి చోటుచేసుకుంది.

క్షణికావేశం ఓ మనిషిని ఎంత క్రూరుడినైనా చేస్తుంది. తను అడిగింది ఇవ్వలేదనో.. తనకు దక్కాల్సింది దక్కలేదనో..  అప్పటివరకు స్నేహితుల్లా మాట్లాడుకున్న వాళ్లే బద్ద శత్రువులైపోతారు. కొన్ని సార్లైతే చంపేసుకోవడం (Murder) వరకూ దారి తీయొచ్చు. ఇలాంటి ఘటనే హైదరాబాద్​ (Hyderabad)లో ఒకటి చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ అడిగితే లేదన్నాడని వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద  బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్​ (fast food center)నిర్వహిస్తున్నాడు. అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ డబ్బా (Pan shop) నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ (Yaseen).. తనకు ఫాస్ట్ ఫుడ్ కావాల్సిందిగా అడిగాడు. రాత్రి (Night)అయినందున తాను షాపును మూసివేస్తున్నానని బిద్యాధర్ చెప్పాడు. దీంతో ఆవేశానికి లోనైన యాసిన్ 10 నిమిషాల తరువాత కత్తి (Knife)తో వచ్చి బిద్యాధర్ మెడ, ఛాతీలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బిద్యాధర్ని స్థానికులు షాపూర్ నగర్ లోని ప్రైవేటు ఆస్పత్రి (Private Hospital)కి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

ఇటీవలె ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ముంబైలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగింది. రాత్రి 12.35 గంటలకు డ్రింక్ చేసి ఉన్న విక్రమ్ పాటిల్ రెస్టారెంట్‌లోని కిచెన్‌లోకి వెళ్లి ఫుడ్ కావాలని డిమాండ్ చేశాడు. రెస్టారెంట్ క్యాషియర్ రామ్‌దాస్ పాటిల్.. రెస్టారెంట్ క్లోజ్ చేశామని, ఫుడ్ లేదని చెప్పారు. దాంతో ఆగ్రహించిన విక్రమ్ పాటిల్ కౌంటర్ దగ్గరకి వెళ్లి క్యాషియర్‌ను విపరీతంగా కొట్టాడు. అంతేకాదు దుర్భాషలాడాడు. దాంతో రెస్టారెంట్ ఉద్యోగులు విక్రమ్ పాటిల్‌ను పట్టుకుని ఆయన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన ఆగలేదు. దాంతో పోలీస్ చేసిన పనిపై రెస్టారెంట్ యజమాని ఫైర్ అయ్యారు. ఇంత సమయం అయ్యాక మేం ఎలా ఫుడ్ ఇవ్వగలగుతామని, దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

రెస్టారెంట్‌లో ఆయన చేసిన పని అంతా అక్కడ సీసీ ఫుటేజీలో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ఈ వీడియోను చూసి పోలీస్ చేసిన పనికి ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే దీనిపై ముంబైలోని సీనియర్ పోలీసు అధికారిని ప్రశ్నించగా సంఘటనకు సంబంధించిన నిజాలు తెలుసుకుంటున్నామని విక్రమ్ పాటిల్ తప్పు ఉందని తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Attempt ot murder, Hyderabad, Murder

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు