A NURSE HAS COMMITTED SUICIDE BY HANGING AFTER AN ADULT CHILD DIED NEAR TIRUKOVILUR SSR
Sad: పాపం ఈ నర్స్.. ప్రేమ పెళ్లి చేసుకుని పాప పుట్టాక ఎంత కష్టమొచ్చిందమ్మా..
ఆషా (ఫైల్ ఫొటో)
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె ఆశలన్నీ చెదిరిపోయాయి. ఏడాది వయసున్న పాప అనారోగ్యానికి గురైంది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె ఆశలన్నీ చెదిరిపోయాయి. ఏడాది వయసున్న పాప అనారోగ్యానికి గురైంది. భర్త సరిగ్గా పట్టించుకోలేదు. ఎన్ని ఆస్పత్రులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడం, పాపను ఆసుపత్రికి తీసుకెళితే భర్త కనీసం చూడటానికి కూడా రాకపోవడం ఇలాంటి పరిణామాలతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ పరిస్థితుల్లో క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తల్లీబిడ్డను విగత జీవులుగా మార్చింది.
ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుకోవిలూరులో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా మనలూరుపేట్లోని మారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన వినోద్ కుమార్‌కు మనలూరుపేట్లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసే ఆషా(26)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ వెళ్లిపోయి రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వినోద్ పెద్దగా చదువుకోకపోవడంతో తిర్పూర్‌లో రోజువారీ పనులకు వెళుతుండేవాడు.
ఆషా హాస్పిటల్లోనే నర్సుగా పనిచేస్తుండేది. పెళ్లయిన కొన్నాళ్లకు ఆషా గర్భం దాల్చింది. ఒక పాప పుట్టింది. ఆ పాపకు కావ్య అని పేరు పెట్టుకున్నారు. ఒక సంవత్సరం వయసున్న కావ్య కొన్నిరోజుల క్రితం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనైంది. దీంతో.. ఆషా తను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలోనే కూతురికి చికిత్స చేయించింది. అయినప్పటికీ పాప ఆరోగ్యం మెరుగుపడలేదు.
ఈ క్రమంలో పాపకు అనారోగ్యంగా ఉందని, తిర్పూర్ నుంచి రావాలని భర్తను ఆషా కోరింది. అయితే.. పాపకు బాగోలేదన్న కనీస ఆలోచన కూడా లేకుండా పాపను చూసేందుకు కూడా వినోద్ వెళ్లలేదు. పాప ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటం, భర్త కనీసం పట్టించుకోకుండా ప్రవర్తించడంతో ఏం చేయాలో పాలుపోక ఆషా తనలో తాను కుమిలిపోయింది. ఈ పరిణామాలన్నీ ఆమెను తీవ్రంగా బాధించాయి. ఇలా ఉండగా.. ఇటీవల ఒకరోజు ఆషా ఇంటి డోర్ ఎంత పొద్దెక్కినా తెరుచుకోలేదు. ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చింది. పోలీసులకు సమాచారం అందించగా స్పాట్‌కు చేరుకున్నారు. కింద గదిలో పాప చనిపోయి పడి ఉండగా, పై గదిలో ఆషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. మనలూరుపేట్ పోలీసులు తల్లీ, కూతురి మృతదేహాన్ని విల్లుపురం ముండియంబాకం గవర్నమెంట్ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనారోగ్యంతో పాప చనిపోయిందని, కన్నబిడ్డ మృతిని తట్టుకోలేక ఆషా కూడా డిప్రెషన్లో సూసైడ్ చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.