Home /News /crime /

A NIZAMABAD MAN WHO DID ONLINE SHOPPING WAS CALLED BY FRAUDSTERS AND TOLD THAT HE GOT A LUCKY DRAW THEN TOOK 2 LAKH AND 84 THOUSAND RUPEES FROM HIM PRV NZB

Online fraud: ఆ ఒక్క దాంట్లో ఆన్​లైన్​లో షాపింగ్​ చేశాడు.. అతన్నుంచి ఏకంగా రూ.2.84 లక్షలు కొట్టేశారు.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడికి ఫోన్ కాల్​ (phone call) వ‌చ్చింది.. మీకు లక్కీ డ్రా (lucky draw)లో కారు బహుమతి వచ్చింద‌ని చెప్పారు అవతలి వ్యక్తి.. దీంతో సంబుర ప‌డిన ఆ యువకుడు (younger) కారు ఎలా తీసుకోవాలని అడిగాడు..

    పి. మహేందర్

    క‌ష్ట‌ప‌డిన సోమ్మే ఇత‌రులు దోచుకుంటుంటే... క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చే డ‌బ్బుల కోసం ఆశ‌ప‌డితే మోసమే మిగులుతుంది.. ఈ స‌త్యాన్ని గ్ర‌హించాల్సిన ఆవ‌స‌రం ఉంది.. ప‌రుల సోమ్ము పాము వంటిది అంటారు.. కానీ సోమ్మ‌ను ఆశ చూపించి మోసం చేసే కేటుగాళ్లు ఎక్కువ‌య్యారు.. వారి బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌సరం ఎంతైన ఉంది.. క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చే డ‌బ్బు నిలవ‌దు... క‌ష్ట‌ప‌డిన సోమ్ము నిలుస్తుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు.. ఈ సూత్రం అంద‌రికి వ‌ర్తిస్తుంది. ఇటీవలె ఇలాంటి ఘటన ఒకటి కామారెడ్డి​లో చోటుచేసుకుంది. ఆ ఘటన గురించి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

    లక్కీ డ్రా..

    ఓ యువకుడికి ఫోన్ కాల్​ (phone call) వ‌చ్చింది.. మీకు లక్కీ డ్రా (lucky draw)లో కారు బహుమతి వచ్చింద‌ని చెప్పారు అవతలి వ్యక్తి.. దీంతో సంబుర ప‌డిన ఆ యువకుడు (younger) కారు ఎలా తీసుకోవాలని అడిగాడు.. అయితే మీకు కారు కావాలంటే ముందుగా 2 ల‌క్ష‌ల 84 వేల రూపాయ‌లు చెల్లించాలని అవతలి వ్యక్తులు చెప్పారు.. దీంతో వెంట‌నే చుట్టు ప‌క్కల వారి వ‌ద్ద అప్పులు చేసి ఫోన్ చేసిన వ్య‌క్తి నంబ‌ర్​కు గూగుల్ పే (google pay) చేశాడు యువకుడు.. తీరా చూస్తే ఆ నంబ‌ర్ స్వీచ్ ఆఫ్ (Switch off) వ‌చ్చింది.. అప్పుడు త‌ను మోస‌పోయాయని గ్రహించి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న కామారెడ్డి (Kama reddy) జిల్లాలో వెలుగు చూసింది..

    షాపింగ్​ చేశాడు అంతే..

    కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌కు చెందిన బాల్ రాజు (bal raju).. హ‌ర్వేస్ట‌ర్ డ్రైవ‌ర్​గా ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు.. అయితే అత‌నికి ఒక రోజు ఫోన్ కాల్​ (Phone call) వ‌చ్చింది.. అతను అంతకుముందే నాప్తాల్ (Naaptol) లో ఆన్ లైన్ షాపింగ్ (Online shopping)  చేశాడు.. మీకు లక్కీ డ్రా లో షిప్ట్ డీజ‌ర్ కారు (Car) తగిలింద‌ని చెప్పారు. దీంతో బాల్ రాజు (bal raju) ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు..  మొద‌ట రిజిస్ట్రేషన్‌ ఫీజు (registration fee) రూ.9,300 చెల్లించాలని చెప్పారు. అదే నంబ‌ర్ కు గూగుల్‌ పే ద్వారా నగదు పంపించారు. అయితే మీకు ఇత‌ర‌ ఛార్జీల కింద రూ.2,84,300 చెల్లించాలని చెప్పారు.. దీంతో వారికి ఆ డ‌బ్బులు విడత‌ల వారిగా గూగుల్ పే (google pay) లో పంపించాడు..

    ఇకా కారు వ‌స్తుంద‌ని సంతోషించే లోపే గూగుల్ పే నంబ‌ర్ స్వీచ్ఆఫ్ వ‌చ్చింది.. దీంతో ఆ విష‌యం స‌న్నిహితుల‌కు బాల్ రాజు చెప్పాడు. అయితే ఇలాంటి మోసాలు త‌రుచుగా జ‌రుగుతున్నాయ‌ని గ్రహించిన బాధితుడు పోలీసులను (police) ఆశ్రయించారు. గూగుల్ పే లో 2 ల‌క్ష‌ల 84 వేల రూపాయ‌లు క‌ట్టి మోసపోయానని పోలీసుల‌కు వివ‌రించారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీకు డ్రా (draw)లో డ‌బ్బులు వ‌చ్చాయి. కారు వ‌చ్చింది.. అని మెసేజ్ (message) లు వ‌చ్చినా.. ఫోన్లు వ‌చ్చినా న‌మ్మ‌వ‌ద్ద‌ని పోలీసులు ప్రజలకు సూచించారు. అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CYBER CRIME, Kamareddy, Online fraud, Online shopping

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు