హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: తొమ్మిదో తరగతి బాలుడితో అత్త లైంగిక సంబంధం.. ఆపై వీడియో తీసి కిలేడీ ఏం చేసిందంటే..

Hyderabad: తొమ్మిదో తరగతి బాలుడితో అత్త లైంగిక సంబంధం.. ఆపై వీడియో తీసి కిలేడీ ఏం చేసిందంటే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పురుషులకు వలపు వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి కొందరి వద్ద నుంచి లక్షల్లో దోచేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే హైదరాబాద్​లో జరిగిన ఈ ఘటన మరో ఎత్తు. ఏకంగా 9వ తరగతి అబ్బాయికే వల వేసింది ఓ కిలాడీ

ఇంకా చదవండి ...

డబ్బు కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు. వ్యక్తిత్వాలను దిగజార్చుకుంటున్నారు. పురుషులపై కొందరు కిలేడీలు వలపు వల (Honey trap) వేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి కొందరి వద్ద నుంచి లక్షల్లో దోచేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే హైదరాబాద్ (Hyderabad)​లో జరిగిన ఈ ఘటన మరో ఎత్తు. ఏకంగా 9వ తరగతి (Nine grade) అబ్బాయికే వల వేసింది ఓ కిలాడీ. ఆ బాలుడితో లైంగిక సంబంధాలు పెట్టుకుని అసలు కథ అప్పుడు ప్రారంభించింది. డబ్బు కోసమే మైనర్ బాలుడ్ని ఆ మహిళ ట్రాప్ చేసింది. అతడిపై లైంగిక దాడి (sexual affair)చేసింది. బాలుడితో ప్రైవేట్‌గా గడుపుతోన్న సమయంలో మరో వ్యక్తి సాయంతో వీడియోలు చిత్రీకరించింది. అనంతరం బెదిరింపులకు దిగి అతడిని ముప్పు తిప్పలు పెట్టింది. బాలుడి ఇంట్లోని బంగారం (gold), నగదు ఇవ్వాలని ఒత్తిడి చేసి.. కాజేసింది. అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఆ లైంగిక దాడికి పాల్పడింది. వీడియో తీసి బెదిరించింది తన అత్త (Aunty) కావడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో చోటుచేసుకుంది.

చార్మినార్‌లోని లాడ్జ్‌కు..

పోలీసుల వివరాల ప్రకారం.. 9వ తరగతి (9th class) చదువుతున్న బాలుడి (14) కుటుంబం ఇటీవల టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్‌కు మారింది. ఈ సమయంలో అల్మారాలోని 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేదు. బాలుడిని తల్లి గట్టిగా అడగడంతో, బెంగళూరు (Bangalore)లో నివసించే తండ్రి బంధువు (వరుసకు అత్త)కు ఇచ్చినట్లు తెలిపాడు. ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగా.. గతంలో స్కూల్ వద్దకు వచ్చి తనను చార్మినార్‌ (Charminar)లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి (Sexual assault) పాల్పడినట్లు చెప్పి బోరుమన్నాడు. మరో వ్యక్తితో కలిసి దీన్ని అత్త వీడియో తీసి, బెదిరించడంతో ఇంట్లోని 20 తులాల గోల్డ్‌తో పాటు రూ.6 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

పోలీసులకు తల్లి ఫిర్యాదు..

తన కుమారుడిపై ఆమె మూడుసార్లు లైంగిక దాడికి (Sexual affairs) పాల్పడిందని… చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి తల్లి (mother) బుధవారం పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మూడేళ్ల కిందట జరిగిందని, పోలీసులు (police) ప్రాథమికంగా గుర్తించారు.

గతంలో కర్నూలు జిల్లాలో..

గతంలో ఇలాంటి హనీ ట్రాప్​ ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అనగానే.. అవతలి వైపు నుంచి అమ్మాయి గొంతు వినిపించింది. “మీరు నాకు బాగా తెలుసు.. చాలా సార్లు మాట్లాడాలని ప్రయత్నించినా కుదర్లేదు. మీరు అందంగా ఉంటారు. తెలిసినవాళ్ల దగ్గర మీ ఫోన్ నెంబర్ సంపాదించా.. ఓసారి ఇంటికి వస్తే ఏకాంతంగా మాట్లాడుకుందాం..” అని ఇంటికి పిలిపించుకుంది. ఇంటికెళ్లిన తర్వాత తియ్యగా మాట్లాడి గదిలోకి తీసుకెళ్లిన అమ్మాయి.. అతడ్ని అర్ధనగ్నంగా ఉండగా ఫోటోలు తీసింది. డబ్బులివ్వకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీంతో కంగారుపడిపోయిన అవతలి వ్యక్తి ఎక్కడ పరువు పోతుందోనని భయపడి లక్షలకు లక్షలు ఆమ్మాయికి ఇచ్చాడు.

First published:

Tags: Crime news, Honey, Hyderabad, Sexual harrassment

ఉత్తమ కథలు