Home /News /crime /

A NINE YEAR OLD GIRL WAS GRIEVOUSLY INJURED AFTER SHE WAS BITTEN BY A GERMAN SHEPHERD IN NOLAMBUR SSR

Nolambur Dog Bite: దీని దుంపతెగ.. పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. తొమ్మిదేళ్ల పాపను.. కిందపడినా వదల్లేదు..

పాపను కుక్క కరుస్తున్న దృశ్యాలు

పాపను కుక్క కరుస్తున్న దృశ్యాలు

ఎంత పెంపుడు కుక్కలైనప్పటికీ ఎవరికీ హాని తలపెట్టనంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పొరపాటున అవి గనుక మీద పడి కరిస్తే ఆ తర్వాత పరిణామాలను ఊహించలేం. తమిళనాడులోని చెన్నైలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది.

  చెన్నై: ఎంత పెంపుడు కుక్కలైనప్పటికీ ఎవరికీ హాని తలపెట్టనంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పొరపాటున అవి గనుక మీద పడి కరిస్తే ఆ తర్వాత పరిణామాలను ఊహించలేం. తమిళనాడులోని చెన్నైలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. డిసెంబర్ 28, 2021న జరిగిన ఈ ఘటన తాజాగా బాధిత కుటుంబం ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని శ్రీరామ్ నగర్‌ మొదటి వీధిలో నివాసం ఉండే వి.సరస్వతి అనే పాప ఆడుకోవడానికి బయటకు వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న సరస్వతి అపార్ట్‌మెంట్ ఆవరణలో ఆడుకుంటూ ఉండగా అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి తన కుక్కను తీసుకుని బయటకు వచ్చింది.

  జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ కుక్క ఆడుకుంటూ ఉన్న సరస్వతి వెంట పడింది. ఆ పాప భయంతో పరిగెత్తింది. ఎంత పరిగెత్తినా వదలకుండా వెంటపడిన ఆ కుక్క ఆమెను దారుణంగా కరిచింది. కిందపడిపోయిన సరస్వతిని పలుమార్లు కరిచింది. ఆమె పైకి లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కూడా మరోసారి కరిచింది. ఇలా సరస్వతి అనే ఆ పాపను 16 సార్లు కరిచింది. ఆ కుక్క యజమాని విజయలక్ష్మితో పాటు స్థానికంగా ఉన్న కొందరు ఆ కుక్కను కర్రలతో బెదిరిస్తే అప్పుడు భయంతో పారిపోయింది. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ పాప కుక్క కరవడంతో తీవ్రంగా గాయపడింది.

  ఇది కూడా చదవండి: Married Woman: భర్త, ఒక పాప.. హ్యాపీ లైఫ్.. ఉదయాన్నే స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది.. కానీ..

  ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ పాపకు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పాపను కాపాడుకోవాలన్న తాపత్రయంలో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సోమవారం పాప డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి చేరుకుంది. సరస్వతి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

  ఇది కూడా చదవండి: Newly Married: భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు.. వింతేముంది అనుకోకండి.. ఊహించని ట్విస్ట్ ఏంటంటే..


  అపార్ట్‌మెంట్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు ఆ కుక్క ఎంత దారుణంగా పాపను కరిచిందో తెలిసొచ్చింది. వెంటనే.. ఆ కుక్కను అలా వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పెంపుడు కుక్క యజమాని విజయలక్ష్మి అనే 43 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయలక్ష్మి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ కుక్కను మున్సిపాలిటీ వాళ్లకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

  ఇది కూడా చదవండి: Ticket Issuer: రైల్వే స్టేషన్‌లో టికెట్లు ఇచ్చే ఉద్యోగం.. డ్యూటీకి వెళ్లిన వాడివి బుద్ధిగా పని చేసుకోక భార్యతో కలిసి ఇదేం పని..

  విజయలక్ష్మిని గత సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే.. ఆమెకు రిమాండ్ విధించారా లేక స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారా అనే విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనా ఒకరి నిర్లక్ష్యం ఇంకొకరి పాలిట ప్రమాదంగా ఎలా మారుతుందో ఈ ఘటన రుజువు చేసింది. పెంపుడు కుక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాల మీదకు తీసుకురావొద్దని పోలీసులు హెచ్చరించారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Chennai, Crime news, Pet dog

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు