సాప్ట్‌వేర్ యువతిపై రేప్ కేసులో మరో టిస్ట్... సాయంత్రం వరకూ...

Hyderabad : దిశ హత్యాచారం కేసులో నిందితుల్ని ఉరి తియ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో... హైదరాబాద్‌లోనే పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మరో రేప్ కేసుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.

news18-telugu
Updated: December 2, 2019, 5:39 AM IST
సాప్ట్‌వేర్ యువతిపై రేప్ కేసులో మరో టిస్ట్... సాయంత్రం వరకూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hyderabad : హైదరాబాద్... నిజాంపేటలోని ఓ అపార్టుమెంట్‌లో తన అక్కతో కలిసి ఉంటున్న యువతిని రేప్ చేసిన కేసులో నిందితుణ్ని పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. నిందితుడి ఫోన్ నంబర్ అక్క దగ్గర ఉండటంతో... ట్రేస్ చేసిన పోలీసులు... అతను కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లు తెలుసుకొని... అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. ఈ కేసుపై కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ఇది రేప్ కాదనీ... అత్యాచారయత్నం మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ఐతే... బాధితురాలు... స్పృహలోకి రావడానికి ఒక రోజు ఎందుకు పట్టిందన్నది తేలాల్సిన ప్రశ్న. రేప్ జరగకపోతే... బాధితురాలు అర్థ నగ్నంగా ఎందుకు ఉందన్నది మరో ప్రశ్న. ఒక వేళ రేప్ జరగకపోయి ఉన్నా... బాధితురాలిని రేప్ చెయ్యాలనే ఉద్దేశంతోనే వివస్త్రను చేశాడు కాబట్టి... అది అత్యాచారమే అంటున్నాయి మహిళా సంఘాలు. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదే జరిగిందా? : బాధితురాలు, ఆమె అక్క కలిసి... హైదరాబాద్... నిజాంపేటలో... ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. అక్క ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. చెల్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అక్క తన పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలో తన వివరాల్ని ఉంచింది. పది రోజుల కిందట ఒకడు అమెను చూసేందుకు వచ్చాడు. తర్వాత మరో నాలుగుసార్లు ఆమె కోసం అంటూ అపార్ట్‌మెంట్‌కి వచ్చాడు. శనివారం ఉదయం కూడా అలాగే వచ్చాడు. ఆ టైంలో చెల్లి ఇంట్లో ఒంటరిగా ఉంది. అక్క ఆఫీస్‌కి వెళ్లిందని చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లోకి వచ్చేసిన అతనను... ఆమెను రేప్ చెయ్యడానికి ట్రై చేశాడు. ఐతే... ఆ పెనుగులాటలో ఆమె స్పృహ తప్పింది.

ఉదయం 11 గంటలకు అపార్ట్ వచ్చిన అతను సాయంత్రం 3.30 వరకు ఆ ఫ్లాట్‌లోనే గడిపాడు. ఆ సమయలో బాధితురాలి అక్క ఫ్లాట్‌కి వచ్చింది. వెంటనే అర్థనగ్నంగా బెడ్‌పై పడి ఉన్న చెల్లెలిపై దుప్పటి కప్పేశాడు. ఏమీ ఎరగనట్లు ఫ్లాట్ తలుపు తీశాడు. బాధితురాలి అక్క ఎందుకొచ్చావని ప్రశ్నించింది. అర్జెంటుగా రూ.2 లక్షలు కావాలన్నాడు. తన దగ్గర లేవంది. సరే అంటూ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. బెడ్‌పై చెల్లి నిద్రపోతోందనుకున్న అక్క... మార్కెట్‌లో పనుంటే ఇంటికి తాళం వేసి వెళ్లింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికొచ్చింది. బెడ్‌పై దుప్పటి చెదిరిపోవడంతో... అర్ధనగ్నంగా స్పృహ తప్పి ఉన్న చెల్లెలు కనిపించింది. ఆమె షాకైంది. ఇంట్లో గోల్డ్ చైన్, ఓ సెల్‌ఫోన్ కనిపించలేదు. అంతా అతని పనే అనుకుంటూ... పోలీసులకు కాల్ చేసింది. ఇంటికి వచ్చిన పోలీసులు... వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోలీసులు కన్‌ఫాం చెయ్యలేదు. కానీ జరిగే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. 11 గంటల నుంచీ 3.30 గంటల వరకూ అదే ఫ్లాట్‌లో ఉన్న నిందితుడు... రేప్ చెయ్యలేదంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నాయి మహిళా సంఘాలు. ఘటన జరిగిన తర్వాతి రోజు స్పృహలోకి వచ్చిన బాధితురాలు ఏం చెప్పిందన్నది తేలాల్సి ఉంది.



 

రెయిన్‌బో ఫొటోగ్రఫీ... సెలబ్రిటీల పరిచయ వేదిక


ఇవి కూడా చదవండి :

Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...


Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు
First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>