(G.Srinivasreddy,News18,Khammam)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలం బండ్రు గొండ గ్రామానికి (Bandru Gonda Village) చెందిన కంటే రమేష్ కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. అయితే ఆ ఇంటి నిర్మాణం(construction) సగం వరకు పూర్తయింది. దానికి నీళ్లు పట్టే సమయంలో.. పక్కనే ఉన్న మరో ఇంటిలో నీటి చుక్కలు పడ్డాయి. దీంతో ఆ పొరుగింటి వ్యక్తి.. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నీళ్లు పట్టే వ్యక్తిని తాళ్లతో బంధించి .. చేతులను (Hands) కట్టేసి.. కొట్టుకుంటూ.. రోడ్డుపై లాక్కెల్లారు. ఇలా అతడిని తాళ్లతో కట్టి లాక్కెళ్లి.. తన ఇంటి ముందు పందిరి గుంజకు బంధించాడు. ఇక అక్కడ అతడిని కర్రలతో, చీపుర్లతో కొట్టాడు. ఇలా అతడిని చిత్ర హింసలకు గురి చేశారు. కనీసం అతడికి తాగడానికి నీళ్లను కూడా ఇవ్వలేదు.
తినేందకు అన్నం కూడా లేకుండా చేశారు. చివరకు మూత్ర విసర్జన సైతం చేయించకుండా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. అతడిని దాదాపు 18 గంటల పాటు గుంజకు కట్టేసి బంధించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు పోలీసులకు తెలవడంతో.. అతడిని విడిచిపెట్టారు. నిన్న ఈ విషయం పై సమాచారం అందించేందుకు 100 కు మూడు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు.. పాల్వంచ రూరల్ ఎస్ఐకి ఫోన్ చేయగా ఎత్తలేదని తెలిపారు.
అనంతరం పాల్వంచ ఏఎస్పీకు (Palvancha ASP) ఫోన్ చేయగా.. అతడు స్పందించాడని. ఏం జరిగిందో వివరాలను తెలిపాలని.. ఆ వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నాడు. అక్కడ జరిగిన ప్రతీ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పారు. అడ్రస్ కూడా చెప్పడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని.. అతడిని విడిపించారు. ఇదిలా ఉంటే.. చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ 18 గంటల పాటు నరకయాతన అనుభవించిన అతడు తనకు న్యాయం చేయాలంటూ కోరాడు.
ఇక ఈ దారుణ ఘటనతో పాటు మరో ఘటన కూడా చోటు చేసుకుందని వివరించాడు. ఇంటి నిర్మాణం కోసం తాను ఇంట్లో రూ.30 వేల నగదును (Thirty Thousand) దాచానని.. అవి ఎవరో దొంగిలించారు. తనకు న్యాయం చేయాలంటూ.. అతడు పోలీసులను వేడుకున్నాడు.
ఎన్ని సార్లు పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తన భార్య ఊరెళ్లిన సమయంలో వాళ్లు గొడవ పెట్టుకునేందుకు రెడీగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Khammam