నెల్లూరులో చేతబడి కలకలం... క్రికెట్ మైదానంలో నల్లకోడి బలి

ఉదయాన్నే క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన కొందరు అవి చూసి భయపడిపోయారు. ఆందోళన చెంది వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు.

news18-telugu
Updated: February 18, 2020, 10:59 AM IST
నెల్లూరులో చేతబడి కలకలం... క్రికెట్ మైదానంలో నల్లకోడి బలి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓవైపు ప్రపంచం సాంకేతిక రంగంలో పరుగులు పెడుతున్నా... మరోవైపు మూఢనమ్మకాలు మత్రం జనాన్ని వీడటం లేదు. ఎక్కడో ఓ చోట చేతబడి, క్షుద్రపూజలు, నరబలులు, జంతుబలులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పిల్లలు ఆడుకునే క్రికెట్ మైదానంలో భయానకంగా మారిన వాతావరణం కనిపించింది. గ్రౌండ్‌లో పెద్ద బొమ్మ గీసి అందులో నల్ల కోడిని బలి ఇచ్చి పూజలు చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఉదయాన్నే క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన కొందరు అవి చూసి భయపడిపోయారు. ఆందోళన చెంది వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజలు వ్యవహారంలో గ్రామస్థులు ఎవరైనా పాత్ర ఉందా లేదా ? బయటవారే ఈ పనులకు పాల్పడ్డారా ? అన్న కోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు స్థానికులు మాత్రం ఎవరిపైన అయిన బాణామతి ప్రయోగం చేశారేమోనని భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గుప్త నిధుల కోసమే ఇలా పూజలు చేశారని చెబుతున్నారు. ఏదైనా పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు జరిగిన తర్వాత అసలు నిజం బయటకు వస్తోంది.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు