• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • A MURDER HAPPENED IN ODISA LOVER CHEATED HER HE BRING HIM TO FOREST AND MURDERED MK

ఫ్రేమ పేరుతో యువతిపై అత్యాచారం...హత్య...దారుణం...

ఘటన జరగకముందే సమాచారం అందుకున్న పోలీసులు.

ఆమెకు మాయమాటలు చెప్పి శనివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

  • Share this:
    ప్రేమ పేరుతో యువతికి మాయమాటలు చెప్పాడు. ఆమెపై తనకున్న కోరికను తీర్చుకున్నాడు. ఆ మోసగాడి మాటలన్నీ నిజమని నమ్మిన యువతి అతని వెంట తిరిగింది. కానీ అతడే నట్టేట ముంచాడు. అత్యాచారం చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కోరాపుట్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. గోపాల్ పూర్ గ్రామానికి చెందిన ఒక యువతి అదే గ్రామానికి చెందిన వాసు అనే అతనితో ప్రేమలో పడింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అతనికి ఆమెపై ముఖం మొత్తింది. ఆమె పెళ్ళి చేసుకోమంటే విముఖత చూపాడు. కానీ, అది మరింత పెద్దది కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శనివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు. అక్కడే ఆమెపై మరోమారు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆపై హత్య చేశాడు. అక్కడ నుంచి పరారయ్యాడు. హతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.
    Published by:Krishna Adithya
    First published: