Home /News /crime /

Extra marital affairs: ప్రియుడి మోజులో పడి.. ఆరేళ్ల కూతుర్ని, భర్తను లేకుండా చేయాలని ఏం చేసిందంటే..

Extra marital affairs: ప్రియుడి మోజులో పడి.. ఆరేళ్ల కూతుర్ని, భర్తను లేకుండా చేయాలని ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధాలు (Extra marital Affair) జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. హత్యలకు (murder) , ఆత్మహత్యల (Suicide) కు కారణమవుతున్నాయి. వాళ్లను నమ్ముకొని ఉన్న కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు

ఇంకా చదవండి ...
వివాహేతర సంబంధాలు (Extra marital Affair) జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. హత్యలకు (murder) , ఆత్మహత్యల (Suicide) కు కారణమవుతున్నాయి. వాళ్లను నమ్ముకొని ఉన్న కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు. రోజూ ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కట్టుకున్న భార్యను లేదా భర్తను వదిలి పరాయి పురుషుడు/మహిళ మోజులో పడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీటిపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. ఇటీవల జరిగిన ఓ ఘోరం ఇలాంటిదే.  ఇటీవల నోయిడాలోని సెక్టార్-93లో ఒక ఆరేళ్ల చిన్నారి మృతదేహం కనుగొన్నారు పోలీసులు.

ఇంటికి విచారణ నిమిత్తం వెళ్లగా

బాలిక శవాన్ని పోలీసులు (police) స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. కాగా విచారణలో బాలిక పేరు నేహా శర్మ (6) అని తెలిసింది. బాలిక నివాసముంటున్న ఇంటికి విచారణ నిమిత్తం వెళ్లగా, అప్పటికే బాలిక తల్లి (Girl mother) భర్తపై కిడ్నాప్‌ కేసు పెట్టినట్లు తెలిసింది. హత్యకు పాల్పడిన నిందితురాలిని కూడా గుర్తించారు. మహిళ పేరు అనురాధ. ఆమె మృతురాలి తల్లి.

మరొక యువకుడితో వివాహేతర సంబంధం..

నోయిడా (Noida)లోని సెక్టార్ 93లో నివసముంటున్న అనురాధ, రామ్‌కుమార్‌లు 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఐతే రామ్‌కుమార్‌ నివాసముంటున్న ఫ్లాట్‌ను అమ్మి, గ్రామంలో సెటిలవ్వాలని అనుకున్నాడు. ఐతే అప్పటికే మరొక యువకుడితో వివాహేతర సంబంధమున్న ((Extra marital Affair)) భార్య అనురాధ (Anuradha)కు గ్రామంలో సెటిలవ్వడం ఇష్టంలేదు. దీంతో కూతురు నేహా శర్మను గొంతునులిమి చంపింది.  సమీపంలోని అడవిలో పడేసింది కిరాతకురాలు. ఫ్లాట్‌పై అత్యాశ, వివాహేతర సంబంధం ((Extra marital Affair)) కారణంగా భర్త (Husband)ను తన దారి నుంచి దూరం చేయాలనుకుంది. కూతుర్ని హత్య చేసి ఆ నేరం భర్తపై నెట్టాలని సదరు మహిళ కుట్ర పన్నిందని పోలీసులు పేర్కొన్నారు.  మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది.

ఇలాంటి ఘటనే తమిళనాడులో..

కాగా, ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో ఇటీవలె చోటుచేసుకుంది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మే రాక్షసిగా మారింది. ప్రియుడి మోజు (Extramarital Affair) లో పసిబిడ్డకు నరకం ఏంటో చూపించింది. అది ఒకటి రెండు సార్లు కాదు.. 250 సార్లు చిత్ర హింసలకు గురి చేసింది. ఆ వీడియోలను ప్రియుడికి పంపించి పైశాచిక అనందం పొందింది. ఇందంతా ప్రియుడిపై మోజుతో చేసినదే.. ముఖ్యంగా ప్రియుడి కారణంగా తరచూ బార్యాభర్తలు (Wife and Husband) మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. దీంతో తన భర్తపై కోపాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించిన ఆ అమ్మ.. అభం శుభం తెలియని తన కన్న కొడుకుపై ప్రతాపం చూపించింది.  లోకజ్ఞానం‌ ఎరుగని చిన్నారిపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా కన్న బిడ్డపై క్రూరంగా దాడి చేసిన సంఘటనలను వీడియోలుగా చిత్రించి (Video Recording) ఆ వీడియోలను భర్తకు, ప్రియుడికి పంపించింది. ఒకటి రెండు కాదు 250 వీడియోలు పంపింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Crime news, Extra marital affair

తదుపరి వార్తలు