Mother Threatens School Board : మాస్క్ లు తప్పనిసరి చేశారన్న కారణంతో స్కూల్ మాజమాన్యాన్ని బెదిరించింది ఓ మహిళ. తన పిల్లలు మాస్క్ ధరించరని,ఒకవేళ ధరించాలిని తప్పనిసరి చేస్తే గన్స్ ను తీసుకొచ్చి దాడి చేస్తానంటూ తన పిల్లలు చదువుతున్న స్కూల్ బోర్డు మెంబర్స్ ని ఓ మహిళ డైరక్ట్ గా బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను అరెస్టు చేయాలనంటూ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు
అమెరికాలోని వర్జీనియాకి చెందిన అమేలియా కింగ్ అనే మహిళ గురువారం రాత్రి తన పిల్లలు చదువుతున్న స్కూల్ బోర్డ్ మీటింగ్ లో పాల్గొంది. స్కూల్ లో విద్యార్థులకు మాస్క్ లు తప్పనిసరి చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. తన పిల్లలు సోమవారం మాస్క్ పెట్టుకోకుండానే స్కూల్ కి వస్తారని,ఒకవేళ మాస్క్ లు తప్పనిసరి అనే ఆదేశం అమలు చేస్తే మాత్రం ప్రతి ఒక్క తుపాకీని తీసుకొచ్చి మీ అంతు చూస్తా అంటూ అక్కడున్నవారాని ఆమె బెదిరించింది. అయితే మాట్లాడటానికి మీకు కేటాయించిన మూడు నిమిషాల సమయం అయిపోయింది అని అక్కడున్నవారు అమేలియా కింగ్ కి చెప్పగా..సరే అయితే సోమవారం కలుద్దాం అంటూ వారిని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు ఆమె. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లిదండ్రుల నుండి ఇటువంటి బెదిరింపులు సహించబడవని, అమేలియా కింగ్ బెదిరింపు వ్యాఖ్యల గురించి తాము పోలీసులకు తెలియజేసినట్లు పేజ్ కౌంటీ స్కూల్స్ సూపరింటెండెంట్ ఆంటోనియా ఫాక్స్ మరియు స్కూల్ బోర్డ్ చైర్మన్ మేగాన్ గోర్డాన్ శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
“No mask mandates. My children will not come to school Monday with a mask on. I will bring every single gun, loaded and ready … I’ll see y’all on Monday.” - woman at a Page County Public Schools board meeting pic.twitter.com/alpEwBxdQ2
— philip lewis (@Phil_Lewis_) January 21, 2022
వర్జీనియా గవర్నర్ గా రాల్ఫ్ నార్తం వైదొలగకముందు..వర్జీనియాలోని అన్ని స్కూల్స్ లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చాయి. అయితే కొత్తగా వర్జీనియా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన రిపబ్లిక్ పార్టీకి చెందిన గ్లెన్ యంగ్కిన్ మాస్క్ తప్పనిసరి ఆదేశాలను రద్దు చేశారు. జనవరి-24 నుంచి వర్జీనియా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు.
ALSO READ Trump : ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఏకంగా ఓటింగ్ మెషిన్లనే సీజ్ చేయాలని ట్రంప్ ఆదేశించారంట!
ఇక,అమేలియా కింగ్ బెరింపు వ్యాఖ్యల ఘటన గురించి లూరే పోలీసులు శుక్రవారం మాట్లాడుతూ... ఆమె వ్యాఖ్యలు కలకలం సృష్టించిన తర్వాత ఆమె తమను సంప్రదించిందని చెప్పారు. ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ పాఠశాల బోర్డుకు ఈ మెయిల్ పంపిందని పోలీసులు తెలిపారు. అధికారుల విచారణకు ఆమె సహకరిస్తుందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona mask, Mother, School, USA