హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mother: భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్న కూతురు గంటలుగంటలు ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమె తల్లికి తెలియడంతో..

Mother: భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్న కూతురు గంటలుగంటలు ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమె తల్లికి తెలియడంతో..

కోయంబత్తూరు జిల్లా మేట్టుపాలయం సమీపంలోని కరమదై ప్రాంతానికి చెందిన నాగమణి(50) తన కూతురైన నదియా అలియాస్ మహాలక్ష్మి(30)తో కలిసి జీవిస్తోంది. నాగమణి భర్త రోజువారీ కూలీగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కొన్నేళ్ల క్రితం నాగమణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నాగమణి కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది.

ఇంకా చదవండి ...

  కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో కన్నతల్లే కూతురిని రాయితో కొట్టి చంపేసింది. పెళ్లయి భర్త చనిపోయి పుట్టింట్లో ఉంటున్న తన కూతురు గంటల కొద్దీ ఫోన్ కాల్స్ మాట్లాడుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి కూతురి నిద్రిస్తుండగా తలపై పెద్ద బండ రాయి తెచ్చి వేసి ఆమెను హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాలయం సమీపంలోని కరమదై ప్రాంతానికి చెందిన నాగమణి(50) తన కూతురైన నదియా అలియాస్ మహాలక్ష్మి(30)తో కలిసి జీవిస్తోంది. నాగమణి భర్త రోజువారీ కూలీగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కొన్నేళ్ల క్రితం నాగమణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నాగమణి కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. నాగమణి కూతురు మహాలక్ష్మికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. మహాలక్ష్మి భర్త శ్రవణకుమార్ కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త చనిపోయినప్పటి నుంచి మహాలక్ష్మి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే.. మహాలక్ష్మి కొన్ని రోజులుగా ఎవరితోనో గంటల కొద్దీ ఫోన్‌లో మాట్లాడుతోంది. ఎంతలా అంటే.. పిల్లలను పట్టించుకోవడం.. వాళ్లకు అన్నం తినిపించడం కూడా మరిచిపోయి గంటల కొద్దీ కాల్స్‌ మాట్లాడుతోంది.

  ఆమె వ్యవహార శైలిని గమనించిన తల్లి నాగమణి పిల్లలను పట్టించుకోకుండా ఏం ఫోన్లంటూ కూతురిని మందలించింది. అయినా మహాలక్ష్మి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో.. ఈ విషయంలో తల్లీకూతురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. గత రాత్రి కూడా మహాలక్ష్మి ఇలానే ఎవరితోనో గంటల కొద్దీ కాల్ మాట్లాడుతుండటాన్ని గమనించిన తల్లి నాగమణి ఆమెతో గొడవపెట్టుకుంది. ఎవరితో అన్ని గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావంటూ నిలదీసింది. అందుకు మహాలక్ష్మి కూడా సమాధానం ఇవ్వకుండా నీకెందుకంటూ తల్లికి ఎదురుచెప్పింది. ఇలా ఈ గొడవ కొంతసేపు జరిగింది.

  ఇది కూడా చదవండి: Shocking: ప్రియుడితో చాటింగ్.. భర్తకు తెలియకుండా ఎప్పటికప్పుడు డిలీట్.. చివరికి ఊహించని ముగింపు..

  ఆ తర్వాత అందరూ నిద్రిస్తుండగా కూతురి ప్రవర్తన పట్ల కోపంతో రగిలిపోయిన నాగమణి నిద్రిస్తున్న మహాలక్ష్మి తలపై బండరాయి తెచ్చి వేసింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై మహాలక్ష్మి చనిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మహాలక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహాలక్ష్మి ఫోన్‌లో ఎవరితో మాట్లాడిందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

  First published:

  Tags: Crime news, Mother, Murder, Tamilnadu

  ఉత్తమ కథలు