హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sangareddy: సంగారెడ్డిలో దారుణం.. 15 నెలల చిన్నారి, పదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకిన తల్లి.. 

Sangareddy: సంగారెడ్డిలో దారుణం.. 15 నెలల చిన్నారి, పదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకిన తల్లి.. 

తల్లి లావణ్య, పిల్లలు (ఫైల్​)

తల్లి లావణ్య, పిల్లలు (ఫైల్​)

సంగారెడ్డి జిల్లా ఆందోల్ పెద్ద చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలో.. ఆర్థిక ఇబ్బందులో తెలియదు కానీ, ఇలా కుటుంబం  ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది.

సంగారెడ్డి జిల్లా  (SangaReddy)ఆందోల్ పెద్ద చెరువు (pond)లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య (family suicide) చేసుకుంది. కుటుంబ కలహాలో.. ఆర్థిక ఇబ్బందులో తెలియదు కానీ, ఇలా కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది. అయితే భర్త ఇంట్లో ఉరేసుకుని (husband hang) చనిపోవడం.. భార్య పిల్లలు చెరువులో దూకి చనిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. వివరాల్లోకి వెళితే..  ఆందోల్ పెద్ద చెరువు (Andhol big pond)లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఇద్దరి మృతదేహాలు (dead bodies) లభ్యమయ్యాయి. మృతులు తల్లి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం వెతకగా మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. వీరిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం  (Ramachadhra puram) పోలీస్ పరిధి తెల్లాపూర్​లోని NEW MIG (BHEL) కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకాంత్​ భార్య, పిల్లలుగా (Chandrakant wife and children) గుర్తించారు పోలీసులు.

గురువారం ఇల్లు వదిలి బయటకి..

తెల్లాపూర్​ పరిధి న్యూ ఎంఐజీ (BHEL) కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకాంత్ దంపతులకు గురువారం గొడవ కావడంతో అతని భార్య లావణ్య (33), కుమారుడు ప్రతామ్ (10), కుమార్తె సర్వజ్ఞ (15 నెలలు) లతో గురువారం ఇల్లు వదిలి బయటకి వచ్చినట్లు సమాచారం. మనస్తాపానికి గురైన భర్త చంద్రకాంత్ (40) కూడా గురువారం సాయంత్రం ఆత్మహత్య (Suicide) చేసుకుని మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడి నుంచి వచ్చిన భార్య పిల్లలు శుక్రవారం ఉదయానికి అంధోల్ పెద్ద చెరువులో మృతదేహాలుగా కనిపించారు.

జోగిపేట, రామచంద్రపురం పోలీసుల కలిసి దర్యాప్తు..

లావణ్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి తప్పిపోయినట్లు నిన్న సాయంత్రం బంధువులు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో పూర్తి వివరాల కోసం జోగిపేట, రామచంద్రాపురం పోలీసులు కలిసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కాగా, దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు (Financial problems)లేక వివాహేతర సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులా...?

జీవన ఉపాధి కోసం చంద్రకాంత్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం జీవనం సాగిస్తున్నాడు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ పోషించలేక వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. గతంలో పటాన్​చెరు పీఎస్ పరిధిలో కుటుంబ కలహాలు ఎక్కువగా వెలుగుచూశాయి. అదే తరహాలో  ఇలాంటి ఘటనలు కూడా జరగవచ్చని అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

లావణ్య ఇద్దరు పిల్లల మృతదేహాలు

కుటుంబ కలహాలు అయితే అందరు కలిసి ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటారు.. కానీ ఇక్కడ బీహెచ్​ఈఎల్ (BHEL)​ కొత్త ఎమ్ఐజీ (New MIG) లో చంద్రకాంత్  ఆత్మహత్య చేసుకోవడం అతని భార్య తో సహా ఇద్దరు పిల్లలు ఆందోల్  చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.

First published:

Tags: Died, Family suicide, Sangareddy

ఉత్తమ కథలు