హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad Story: అయ్యో ఎంతటి కష్టం వచ్చింది తల్లీ నీకు.. ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అలా చేస్తావా?

Sad Story: అయ్యో ఎంతటి కష్టం వచ్చింది తల్లీ నీకు.. ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అలా చేస్తావా?

ఇద్దరు పిల్లలతో తల్లి (ఫైల్​)

ఇద్దరు పిల్లలతో తల్లి (ఫైల్​)

క్షణికావేశం ఓ కుటుంబాన్నే బలి తీసుకుంది. భార్య భర్తల మధ్య గొడవలు కావొచ్చు మరేదైనా గొడవ కావచ్చు కానీ.. పసి ప్రాణాలను కలిచివేసింది. తాను చనిపోవడమే కాకుండా ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా తనతో పాటు తీసుకువెళ్లింది ఆ తల్లి.

క్షణికావేశం ఓ కుటుంబాన్నే బలి తీసుకుంది. భార్య భర్తల మధ్య గొడవలు కావొచ్చు మరేదైనా గొడవ కావచ్చు కానీ.. పసి ప్రాణాలను కలిచివేసింది. తాను చనిపోవడమే కాకుండా ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా తనతో పాటు తీసుకువెళ్లింది ఆ తల్లి. తెలంగాణ (Telangana)లోని రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా బోయినపల్లి లో ఈ విషాదం చోటు చేసుకుంది.  ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో (Well) దూకి ఆత్మహత్యకు (Mother Suicide With Her Children) పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది . పోలీసుల కథనం ప్రకారం ..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కి చెందిన పోతర్ల మహిపాల్ ఉపాధి కోసం దుబాయ్ (Dubai) వెళ్ళాడు . ఆయన భార్య అనూష (25) , ఇద్దరు కుమారులు మోక్షిత్ ( 3 ) , గ్రక్షిత్ ( 1 )లతో కలసి గ్రామంలోనే ఉంటున్నారు .

ఇద్దరు పిల్లలతో తల్లి (ఫైల్​)

ఏమైందో ఏమో కానీ గ్రామంలోని వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లింది. తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లింది. పిల్లలతో పాటు బావిలో దూకి ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటో ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు . అలాగే బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

బావిలో మృతదేహాలు

గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా (SangaReddy)ఆందోల్ పెద్ద చెరువు (pond)లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య (family suicide) చేసుకుంది. కుటుంబ కల హాలో.. ఆర్థిక ఇబ్బందులో తెలియదు కానీ, ఇలా కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది. అయితే భర్త ఇంట్లో ఉరేసుకుని (husband hang) చనిపోవడం.. భార్య పిల్లలు చెరువులో దూకి చనిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆందోల్ పెద్ద చెరువు (Andhol big pond)లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఇద్దరి మృతదేహాలు (dead bodies) లభ్యమయ్యాయి. మృతులు తల్లి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం వెతకగా మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. వీరిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం (Ramachadhra puram) పోలీస్ పరిధి తెల్లాపూర్​లోని NEW MIG (BHEL) కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకాంత్​ భార్య, పిల్లలుగా (Chandrakant wife and children) గుర్తించారు పోలీసులు.

గతంలో మేడ్చల్​లోనూ ఇలాగా జరిగింది ఓ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య (Suicide attempt)కి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు. అయితే ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యువాత పడ్డారు. తాను చనిపోతే పిల్లల్ని భర్త బాగా చూసుకోడనే ఉద్దేశంతో పిల్లలతో సహా చెరువులో దూకింది (with her three children jumped into a pond). ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడగా, ఐదేళ్ల పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు.

First published:

Tags: Attempt to suicide, Dubai, Mother suicide with her childrens, Siricilla

ఉత్తమ కథలు