Attack on Women: పట్టపగలే యువతిని కాల్చి చంపిన దుర్మార్గుడు.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫరీదాబాద్‌లోని బల్లబ్‌ గర్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ‌స్థానిక అగర్వాల్ కళాశాల బయటన సోమవారం నికితా తోమర్ అనే 21 ఏళ్ల విద్యార్థిని పగటిపూట ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టిస్తోంది.

news18-telugu
Updated: October 27, 2020, 11:38 AM IST
Attack on Women: పట్టపగలే యువతిని కాల్చి చంపిన దుర్మార్గుడు.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు
యువతిపై దాడి చేస్తున్న నిందితుడు
  • Share this:
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫరీదాబాద్‌లోని బల్లబ్‌ గర్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ‌స్థానిక అగర్వాల్ కళాశాల బయట సోమవారం నికితా తోమర్ అనే 21 ఏళ్ల విద్యార్థిని పగటిపూట కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టిస్తోంది. బాధితురాలు గత నెలలో నిందితుల్లో ఒకరైన తౌఫీక్‌పై వేధింపులు, వేధింపుల ఫిర్యాదు చేయడం గమనార్హం. కారులో వచ్చిన దుండగులు ఆమెపై కాల్పులకు దిగాడు. అతడి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించిన నికితపై పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించిగా బాధితురాలి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలిపై కాల్పులు జరిగిన వెంటనే మరో నిందితులు కూడా కారులోంచి దిగి తౌఫీక్‌ను తిరిగి కారులోకి లాగారు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మొదట బాధితురాలిని ఎత్తుకెళ్లాలని భావించాడు. కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చంపేశాడు. నికితా ప్రస్తుతం బీ. కామ్ చివరి సంవత్సరం చదువుతోంది. స్థానిక ఏసీపీ జైవీర్ రతి ఈ విషయంపై మాట్లాడుతూ.. నిందితుడు తౌఫీక్ ను సోహ్నాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పాడు. అతడిపై కొన్ని నెలల క్రితం వేధింపులకు పాల్పడ్డ కేసును బాధితురాలి బంధువు నమోదు చేశారని చెప్పారు. కానీ ఆ సమయంలో రాజీ కుదిరిందని తెలిపారు. స్నేహాన్ని తిరస్కరించడమే అతను ఈ హత్యకు పాల్పడడానికి కారణం కావొచ్చని ఏసీపీ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన కామాంధుల చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా ఓ యువతిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మెట్ పల్లి ప్రాంతానికి చెందిన దివ్య ( పేరు మార్చాం) అనే యువతి స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే అదే ప్రాంతంలో నివసించే నలుగురు యువకులు సురేష్, రమేష్, గోపి, రాజు( పేర్లు మార్చాం) అల్లరి చిల్లరగా తిరుగుతుండేవారు. అదే ప్రాంతంలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బతికే వారు.కాగా సురేష్ కన్ను దివ్యపై పడింది. ఆమెను ప్రేమించాల్సిందిగా వెంటపడ్డాడు. అందుకు ఆమె కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని లొంగ దీసుకోవాలని సురేష్ ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే సురేష్ తన స్నేహితులైన రమేష్, గోపి, రాజులతో కలిసి కుట్రకు తెరలేపాడు. యువతిని కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని ప్రయత్నించారు. దీంతో ఆ యువతిని నలుగురు కలిసి కిడ్నాప్ చేశారు. వీరింత కలిసి యువతిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నలుగురితో పాటు మరో నిందితుడు కూడా ఉన్నాడు.
Published by: Nikhil Kumar S
First published: October 27, 2020, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading