• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A MINOR WHO WAS KIDNAPPED TWO DAYS BACK IN UTTARPRADESH FOUND BRUTALLY MURDERED MS GH

Kidnap: పట్టపగలే కిడ్నాప్.. ఆపై హత్య.. పాపం.. ఆ బాలుడికి అప్పుడే నూరేళ్లు నిండాయి..

Kidnap: పట్టపగలే కిడ్నాప్.. ఆపై హత్య.. పాపం.. ఆ బాలుడికి అప్పుడే నూరేళ్లు నిండాయి..

ప్రతీకాత్మక చిత్రం

Uttarpradesh Kidnapping: కిడ్నాప్ చేసిన రెండవ రోజే 40 లక్షల రూపాయల సొమ్ము కావాలంటూ కిడ్నాపర్లు ఫోన్లో బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పుడు తీరిగ్గా పోలీసులు స్పందించి.. రంగంలోకి దిగారు. ఎంత గాలించినా బాబు ఆచూకి మాత్రం దొరకలేదు. ఆ తెల్లారి గ్రామం సరిహద్దుల్లో...

  • News18
  • Last Updated:
  • Share this:
ఉత్తరప్రదేశ్ (UttarPradesh) లోని కాస్గంజ్ జిల్లా కు చెందిన ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం పట్టపగలే లోకేష్ అనే బాలుడిని కిడ్నాప్ కు గురయ్యాడు. సరిగ్గా రెండు రోజుల తరువాత గ్రామ పొలిమేర్లలో 10 ఏళ్ల బాలుడైన లోకేష్ మృతదేహం లభించింది. కిడ్నాపర్ల (kidnapers) కోసం పోలీసులు ఇంకా గాలిస్తుండగా, బాబు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. అత్యంత కిరాతకంగా బాలుడు హత్యకు గురికావటంతో ప్రస్తుతం పీథంపూర్ గ్రామం విషాదంలో మునిగిపోయింది. లోకేష్ ను కిడ్నాప్ చేసినట్టు బాలుడి కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించలేదు.

మరోవైపు కిడ్నాప్ చేసిన రెండవ రోజే 40 లక్షల రూపాయల సొమ్ము కావాలంటూ కిడ్నాపర్లు ఫోన్లో బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పుడు తీరిగ్గా పోలీసులు స్పందించి.. రంగంలోకి దిగారు. ఎంత గాలించినా బాబు ఆచూకి మాత్రం దొరకలేదు. ఆ తెల్లారి గ్రామం సరిహద్దుల్లో నోటికి టేపు వేసి, చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న లోకేష్ మృతదేహం కనిపించింది. పోలీసుల నిర్లక్ష్యం తమ బాబు ప్రాణం తీసిందని కుటుంబీకులు వాపోతున్నారు. ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు.. వారికోసం ప్రత్యేకంగా గాలింపు బృందాలు రంగంలోకి దిగినట్టు పోలీసులు వివరిస్తున్నారు.

యూపీలో పెరుగుతున్న క్రైం రేట్

తాజాగా విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం యూపీలో క్రైమ్ రేటు చాలా ఎక్కువగా ఉంది. యూపీలో ప్రతి రెండు గంటలకు ఒక రేప్ కేసు నమోదవుతోంది. చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రతి 90 నిమిషాలకు ఒక కేసు అధికారికంగా నమోదు అవుతోంది. దేశంలోని అన్నినగరాలకంటే ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో అత్యధికంగా మహిళలపై నేరాలు జరుగుతున్నట్టు కేసులు నమోదవుతున్నాయి. వీటితోపాటు వరకట్న వేధింపుల కేసుల్లో కూడా యూపీలో ఎక్కువగా నమోదవుతున్నాయి.

సీనియర్ సిటిజన్లపై రాష్ట్రంలో జరుగుతున్న దాడుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని వయసుల ప్రజలకు భద్రత కరువైందని, శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాఫియా గ్యాంగులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న యూపీ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మాత్రం భరోసా కల్పించకేలపోతోందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసు శాఖ వైఫల్యం చెందుతోందన్న ఆరోపణలపై స్పందించిన డిపార్ట్ మెంట్.. రాష్ట్రంలో జనాభా ఎక్కువ కాబట్టి క్రైం రేటు కూడా ఎక్కువని వాదిస్తోంది. 2018 నేషనల్ క్రైం రికార్డ్స్ ప్రకారం.. యూపీలో జరుగుతున్న హత్యలు నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువని రాష్ట్ర పోలీసులు వివరిస్తున్నారు.

మధ్యప్రదేశ్ Vs రాజస్థాన్ కిడ్నాప్ కేసు

ఇటీవలే మధ్యప్రదేశ్ లో (Madhya Pradesh) జరిగిన భారీ కిడ్నాప్ ను పోలీసులు భగ్నం చేశారు. 38 మంది రాజస్థాన్ కు (Rajasthan) చెందిన గిరిజన మహిళలు, పిల్లలను మధ్యప్రదేశ్ కిడ్నాపర్ల చెర నుంచి రాజస్థాన్ పోలీసులు కాపాడారు. మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన 100 మంది ప్రజలు కలిసి .. తమ గ్రామంలో జరుగుతున్న భారీ చోరీలకు రాజస్థాన్ లోని ఓ గ్రామస్థులు కారణమంటూ ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారు.

బోయినపల్లి కిడ్నాప్..

ఇక హైదరాబాదుకు (Hyderabad) చెందిన బిజినెస్ మ్యాన్ ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Akhilapriya) ప్రధాన సూత్రధారంటూ ఆమెను అరెస్టు చేసిన పోలీసులు మొత్తం కిడ్నాప్ వ్యవహారంపై దృష్టిసారిస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published: