ప్రేమ గుడ్డిదే.. అంటూ మరో సంఘటన రుజువు చేసింది. కనీసం రక్త సంబంధాలు కూడా చూడకుండ ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత విషయం తెలిసి తల్లిదండ్రులు, ఇతర పెద్దలు మందలించడంతో ఏం చేయాలో తెలియక చివరికి ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నా మరోసారి తాజాగా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు ప్రేమించుకున్నారు. అయితే తండ్రి ఒకడే అయినా తల్లులు వేరు కావడంతో వారిద్దరి మధ్య పుట్టిందట ..
వివరాల్లోకి వెళితే..కర్ణాటక రాష్ట్రం క్రిష్ణగిరి సమీపంలో ఓ గ్రామానికి చెందిన బస్వరాజు కు ఇద్దరు భార్యలు. రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.. ఈ క్రమంలోనే గురుడు రెండు పెళ్లిలు చేసుకుని ఇద్దరు భార్యలను పోషిస్తున్నాడు.. కాగా మొదటి భార్యకు నలుగురు సంతానం కాగా రెండవ భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.. అయితే మొదటి భార్య నాలగవ కూతురు (16) రెండవ భార్య కుమారుడి మధ్య ప్రేమాయణం కొనసాగింది. అయితే ఇలా ప్రేమాయణం కొనసాగుతున్నా విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇద్దరిని మందలించారు. దీంతో అవమానానికి గురైన బాలిక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో విషయం మీడియాకు తెలిసింది.
కాగా ఇలాంటీ సంఘటనలు గతంలో కూడా జరిగాయి.. రక్తం పంచుకుపుట్టిన వారే ప్రేమ మాయలో పడడం కనీస కుటుంబ బంధాలు మరవడం అంత్యంత దారుణంగా కనిపిస్తోంది.అయితే ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై పలు రకాల వాదనలు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల పెరుగుదల ప్రవర్తనలో మార్పులు గమనించకపోవడం లాంటీ అంశాలే ప్రధానంగా ముందుకు వస్తున్నాయి.. తల్లిదండ్రులు బాధ్యత రహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటి అంశాలే ఇలాంటీ సంఘటనలకు కారణం అవుతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Lovers suicide