A MINOR GIRL BECOM PREGNANT BECAUSE PETTY TANTRIKS RAPES LAST THREE MONTHS NGS
AP Crime News: క్షుద్ర పూజల పేరుతో అఘాయిత్యం.. మైనర్ బాలికకు గర్భం రావడంతో వెలుగులోకి దారుణం
ప్రతీకాత్మక చిత్రం
AP Crime News: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదా..? మహిళలనే కాదు.. చిన్నారులను కూడా కామాంధులు వదలడం లేదు.. ఆశ చూపించో.. బెదిరించో.. మాయ మాటలు చెప్పో.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
AP Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకూ నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు.. మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. రోజు ఎక్కడో ఒక దగ్గర అత్యాచార ఘటనలు (Minore Rape) కలకలం రేపుతున్నాయి.. మైనర్లను కూడా కామాంధులు వదలడం లేదు.. తమ కోరికలు తీర్చుకోవడానికి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆశలు చూపిస్తున్నారు లేదంటే మాయ మాటలు చెబుతున్నారు. అప్పటికీ కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు.. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో పెద్ద మనుషుల్లా చలమాణి అయిపోతున్నారు. ఆఖరికి ఆ మైనర్లు గర్భం దాలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఏపీలో చట్టాలు ఎంత కఠినంగా మారినా బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. బలహీనతలను అవకాశంగా చేసుకుని అమాయకులైన ఆడపిల్లల జీవితాలను బలితీసుకుంటున్నారు.
తాజాగా అలాంటి ఘటన కలకలం రేపింది. ఇంట్లో పరిస్థితులు చక్కబెడతామంటూ ఓ బాలికకు మాయమాటలు చెప్పి వశం చేసుకున్న క్షుద్రమాంత్రికులు. భయపెట్టి మూడు నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు (Parents) చనిపోతారన్న భయంతో మౌనంగా భరించిన బాలిక...గర్భం దాల్చేసరికి జరిగిన ఘోరం భయటపడింది. ఆరు పదుల వయస్సు ఉన్న ఇద్దరు మృగాళ్లు చేసిన పాపానికి 16ఏళ్ల బాలిక నిండు జీవితం బలైపోయింది. సమాజం సిగ్గుపడే ఈ ఘటన చిత్తూరు జిల్లా (Chitoor District)లో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా డక్కలి గ్రామానికి చెందిన 55ఏళ్ల శ్రీరాం సుబ్బయ్య, 60ఏళ్ల భాస్కర్ క్షుద్రపూజలు చేస్తుంటారు. అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలికను గమనించిన వీరు....ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయని... వాటిని పరిష్కరిస్తామంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన బాలిక...వారిని కలవడం మొదలుపెట్టింది. ఇదే అదునుగా చేసుకున్న వారిరువురు బాలికకు క్షుద్రపూజల పట్ల భయం కలిగించారు. తాము చెప్పినట్లు వినకపోతే....మీ తల్లిదండ్రులు చనిపోతారంటూ బెదిరించారు.
వారి మాటలకు, క్షుద్రపూజలకు భయపడిన బాలిక వారికి లొంగిపోయింది. గత మూడు నెలలుగా శ్రీరాం సుబ్బయ్య, భాస్కర్... ఆ బాలికపై లైంగిక దాడి చేస్తున్నారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఇంట్లో వారికి చెబితే ఏమౌతుందో అనే భయంతో బాలిక ఆ వేదనను మౌనంగానే భరించింది. కొన్ని రోజులుగా బాలిక నీరసంగా ఉండడంతో.. తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుబ్బయ్య, భాస్కర్ లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి...వారిని అరెస్టు చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.