Telangana: పంది మాంసం కుక్కకు పెట్టలేదని తోటి కార్మికుడిని చంపిన మనిషి...

ప్రతీకాత్మక చిత్రం

పెంపుడు జంతువుకు మాంసం పెట్టలేదని ఒక వ్యక్తి.. మరో వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి.. ఒకరి ప్రాణాలు తీశాడు. పెంపుడు కుక్క కు పంది మాంసం పెట్టనందుకు హ‌మాలీల మ‌ద్య గొడ‌వ ఒక‌రి ప్రాణం తీసింది.

  • News18
  • Last Updated :
  • Share this:
    మనిషి తన ఆవిర్భావం తర్వాత కొద్ది రోజులకు మనుగడ కోసం జంతు వేట సాగించాడు. ఆ తర్వాత నాగలి కనుగొన్నాడు. పంటలు పండించాడు. ఆనక.. ఇరుసుతో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఖగోళ శాస్త్రం గురించి కూడా తెలుసుకున్నాడు. విమానాలు గాలిలోకి లేపాడు. రాకెట్ సైన్స్ కనుగొన్నాడు.. అన్నీ మారాయి. కానీ మనిషి మారలేదు. అతడి క్రూర స్వభావం మారడం లేదు. విచక్షణ కలిగిన మనుషుల కంటే.. అవి ఏమాత్రం లేని మూగ జీవాలే నయం. తాజా ఘటన చూస్తే పైన చెప్పిందంతా నిజమనిపించకమానదు. తన పెంపుడు జంతువుకు మాంసం పెట్టలేదని ఒక వ్యక్తి.. మరో వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి.. ఒకరి ప్రాణాలు తీశాడు. పెంపుడు కుక్క కు పంది మాంసం పెట్టనందుకు హ‌మాలీల మ‌ద్య గొడ‌వ ఒక‌రి ప్రాణం తీసింది. త‌న కుక్క కొసం తోటి హ‌మాలిని బండరాయితో కొట్టిచంపాడొక వ్యక్తి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

    వివరాల్లోకెళ్తే... నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోక‌న్ ప‌ల్లి గ్రామంలోని బ్రాహ్మణి రైస్ మిల్ లో మంగళవారం చోటు చేసుకుందీ ఘటన. ఆ రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 11 మంది హమాలీలు గ‌త కొంత కాలంగా పనిచేస్తున్నారు. రైస్ మిల్ సూప‌ర్ వైజ‌ర్ గా వ్యవహరిస్తున్న నరేష్ చౌదరి.. ఆదివారం రాత్రి పంది మాంసం తీసుకువ‌చ్చి హ‌మాలీల‌కు ఇచ్చాడు. హ‌మాలీలు ఆ మాంసాన్ని వంట వండుకొని తృప్తిగా భోజనం చేస్తున్నారు.

    ఇదీ చదవండి.. కాళ్ల పారాణి ఆరకముందే.. భర్త ఊపిరిని ఆర్పేసిన భార్య.. పెళ్లైన వారం రోజుల్లోనే హత్య

    ఇంతలో.. అభిమన్యు అనే హమాలీ తన పెంపుడు కుక్క తో అక్కడకు వచ్చి.. త‌న కుక్కకు కూడా పంది మాంసం పెట్టాలని వారిని కోరాడు. కానీ దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో అతడు తోటి హమాలీలతో వాదించాడు. అడ్డుకున్న మరో హమాలి మిథున్ పైకి బండరాయితో దాడికి యత్నించాడు. అతడికి తలకు తీవ్ర గాయాలు కావడంతో భయపడిన మిథున్.. ఘటనాస్థలం నుంచి పారిపోయాడు.

    ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మరో హమాలీ తేజు సదా.. అభిమన్యుని అడ్డుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమన్యు.. తన చేతిలో ఉన్న బండరాయితో మిథున్ తలపై విచక్షణారహితంగా కొట్టాడు. అతడు కింద పడి రక్తం కారుతున్నా కనికరించలేదు. దీంతో రక్తపు మడుగులో ఉన్న తేజు.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సోదరుడు బిజిలీ సదా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Srinivas Munigala
    First published: