Home /News /crime /

A MESSAGE SENT TWO YEARS AGO HAS NOW CAUSED THE MURDER OF A PERSON IN JANAGAMA PRV

Crime news: రెండేళ్ల క్రితం పంపిన ఓ మెసేజ్​.. యువకుడి హత్యకు దారి తీసింది.. అసలేమైంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ చిన్న మెసేజ్‌.. యువకుడి హత్యకు దారి తీసింది. అన్నతో కాళ్లు మొక్కించారని కోపం పెంచుకున్న తమ్ముడు.. చివరకు మృత్యువాత పడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    ఓ చిన్న మెసేజ్‌ (Message).. యువకుడి హత్యకు (Murder) దారి తీసింది. అన్నతో కాళ్లు మొక్కించారని కోపం పెంచుకున్న తమ్ముడు.. చివరకు మృత్యువాత పడ్డాడు. పక్కాప్లాన్‌తో మద్యం తాగేందుకు రప్పించి.. అదును చూసి కత్తితో దారుణంగా చంపేశారు. ఇంతకీ ఆ మెసేజ్​ ఎవరు పంపారు? అందులో ఏముంది? ఆ మెసేజ్​కు ఈ మర్డర్​కి సంబంధం ఏంటి? ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలివే.. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ (Janagama) జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ మూలబావికి చెందిన పకీరు రమేశ్‌ ఓ ప్రైవేట్‌ స్కూల్లో పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ వివాహిత ఫోన్‌కు రెండేళ్ల క్రితం అసభ్యకర మెసేజ్‌ పంపించాడు. దీంతో ఆమె భర్త ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న పగడాల సందీప్‌ రమేశ్‌ను మందలించాడు. కాళ్లు మొక్కి తప్పు ఒప్పుకోవడంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది.

    Land disputes: హద్దులు చూడటంలో తేడా.. 4 గుంటల భూమి కోసం కత్తులతో రణరంగం.. 

    అయితే ఈ గొడవలో అకస్మాత్తుగా రమేశ్​ తమ్ముడు దిగాడు. అతనికి అన్న అంటే ఎంతో ఇష్టం. దీంతో తన అన్నతో కాళ్లు మొక్కించారనే కోపంతో రమేశ్‌ తమ్ముడు పకీరు సురేశ్‌ సందీప్‌కు ఫోన్‌కు చేసి నిలదీశాడు. అంతటితో ఆగకుండా మెసేజ్‌ గురించి తెలిసిన వారందరికీ చెప్పాడు. అనంతరం రమేశ్‌ తన తమ్ముడు సురేశ్, సందీప్‌ ఇద్దరినీ పిలిచి కాంప్రమైజ్‌ చేశాడు. అక్కడితో గొడవ ముగియగా.. మూడ్రోజుల క్రితం సురేశ్‌ మరోసారి సందీప్‌కు ఫోన్‌ చేసి అదే విషయం గురించి మాట్లాడాడు. తన అన్నతో కాళ్లు మొక్కించుకుంటారా అని పగ పెంచుకున్నాడు.



    కాగా, సురేశ్, సందీప్, మరో స్నేహితుడు విజయ్‌ ముగ్గురు కలిసి ఈనెల 16న రాత్రి మద్యం తాగారు. ఇక్కడే ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. తాగిన మైకంలో సందీప్‌ తన వద్ద ఉన్న కీచైన్‌ కత్తితో సురేశ్‌ను ఇష్టం వచ్చినట్లుగా పొడిచాడు. మెడకోసి అత్యంత దారుణంగా చంపేశాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని విచారణ కొన సాగించారు. సందీప్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సందీప్‌ను రిమాండ్‌కు పంపించారు పోలీసులు.

    భూమి విషయంలో హత్య..

    ఉమ్మడి కరీంనగర్​ (Karimnagar) జిల్లా వీణవంక మండల నికి చెందిన నోముల శ్రీనివాస్​కు గ్రామంలో 4 గుంటల భూమి (Land) ఉంది . దాన్ని మల్లయ్యకు విక్రయించాడు . అయితే హద్దులు (Boundaries) చూపించే విషయంలో గ్రామానికే చెందిన గెల్లు సమ్మయ్యకు , శ్రీనివాస్​కు గొడవలు జరుగుతున్నాయి . ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ హద్దులు చూపించేందుకు వెళ్లగా సమ్మయ్య కుమారుడు కౌశిక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అతని కుమారుడు అక్షయ్ తోపాటు అక్కడే ఉన్న గెల్లు మల్లయ్యలపై దాడి చేశాడు . ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి . తండ్రి మృతి చెందాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Murder, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు