A MARRIED WOMAN LIFE AT THE AGE OF 33 LEADS TO SAD END INCIDENT HAPPEND IN KHAREKURAN VILLAGE SSR
Married Woman: ఈ 33 ఏళ్ల మహిళకు 2019లో పెళ్లైంది.. పాపం.. పెళ్లయిన ఇన్నేళ్ల తర్వాత..
ఆర్తి (ఫైల్ ఫొటో)
పాల్గర్కు చెందిన ఆర్తి అధికారి అనే 33 ఏళ్ల మహిళకు, ఖరేకురన్ గ్రామానికి చెందిన మనీష్ పటేల్‌కు 2019 జనవరిలో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది.
పాల్గర్: మహారాష్ట్రలోని పాల్గర్లో దారుణం చోటుచేసుకుంది. పాల్గర్ పరిధిలోని ఖరేకురన్ గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహం గ్రామ పరిధిలోని పొలంలో దొరికింది. ఆమె తలను, ముఖాన్ని రాళ్లతో ఛిద్రం చేసి మరీ ఆమెను చంపారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్గర్కు చెందిన ఆర్తి అధికారి అనే 33 ఏళ్ల మహిళకు, ఖరేకురన్ గ్రామానికి చెందిన మనీష్ పటేల్‌కు 2019 జనవరిలో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. రానురాను భర్త, అత్త నుంచి వేధింపులు పెరిగిపోయాయి.
కొన్నాళ్లు ఆర్తి అన్నీ భరిస్తూ అక్కడే ఉన్నప్పటికీ అత్త, భర్త కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆ వేధింపులు తాళలేక పెళ్లయిన కొన్ని నెలలకే పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి పాల్గర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కొన్నిరోజుల క్రితం ఆర్తి భర్త మనీష్ ఆమెను వెతుక్కుంటూ పుట్టింటికి వెళ్లాడు. ఆమెను ఇక ఇబ్బంది పెట్టనని.. ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటానని అత్తమామలకు మాటిచ్చాడు. ఆర్తి కూడా భర్త మాటలు నమ్మి అతనితో కలిసి ఖరేకురన్ గ్రామానికి వెళ్లింది. కొన్నాళ్లు ఆమెతో బాగానే ఉన్న భర్త, అత్త మళ్లీ వేధించసాగారు. ఈ క్రమంలో.. నవంబర్ 5న ఆర్తి కనిపించకుండా పోయిందని ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో.. ఆమె జాడ కనిపెట్టేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. ఆర్తి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. నవంబర్ 8న సాయంత్రం ఆమె మృతదేహం ఖరేకురన్ గ్రామ సమీపంలోని పొలంలో కనిపించింది.
ఆమె ముఖాన్ని, తలను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కూతురు హత్యకు గురైందన్న విషయం తెలిసి ఆర్తి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆమె భర్త, అత్తింటి వాళ్లే తమ కూతురిని చంపేసి ఇలా పొలాల్లో పడేసి ఉంటారని కన్నీరుమున్నీరయ్యారు. పాల్గర్ పోలీసులు ఈ కేసులో తేజ అనే 22 ఏళ్ల యువకుడిని అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. ఆర్తి భర్త, అత్తను కూడా కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గ్రామస్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆర్తి హత్యకు ఆమె భర్త మనీష్ పటేల్, ఆర్తి అత్త కుట్ర పన్ని ఉంటారని.. ఆమెను హత్య చేసేందుకు వారికి తేజ సహకరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.