ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని..దివ్యాంగుడైన భర్తను చంపిన భార్య..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ..తన ప్రియుడితో కలిసి  దివ్యాంగుడైన భర్తను దారుణంగా హత్య చేసింది.

news18-telugu
Updated: March 22, 2019, 8:09 AM IST
ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని..దివ్యాంగుడైన భర్తను చంపిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 22, 2019, 8:09 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ..తన ప్రియుడితో కలిసి  దివ్యాంగుడైన భర్తను దారుణంగా హత్య చేసింది.  ఈ దారుణ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి కాశయ్య(40) దివ్యాంగుడు. అదే ప్రాంతానికి చెందిన మేన మామ కుమార్తె నాగలక్ష్మిని.. 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఇద్దరు సంతానం. అయితే ఉంటున్న చోట బతకడానికి సరిగా లేక.. మెరుగైన జీవితం కోసం.. కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన కాశయ్య ఎల్‌బీనగర్‌లోని ఎస్‌బీహెచ్‌ కాలనీ వెంచర్‌–3లో సుకృత అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య.. నాగలక్ష్మి అక్కడే.. ఇళ్లల్లో పని చేసేది. అయితే.. నల్లగొండ జిల్లా, కట్టవారి గుడెంకు చెందిన కొండ సైదులుతో నాగలక్ష్మి గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.


నాగలక్ష్మి కోసం సైదులు.. తరచూ ఇంటికి వస్తుండటంతో కాశయ్య అతడిని మందలించేవాడు. అయితే.. ఈనెల  15న రాత్రి ఇంటికి వచ్చిన సైదులు, నాగలక్ష్మితో కలిసి కాశయ్యతో గొడవపడ్డారు. దీంతో కాశయ్య తన తమ్ముడు సురేష్‌కు ఫోన్‌ చేసి జరిగిన విషయం గురించి తెలియజేశాడు . దీంతో ఆగ్రహానికి లోనైన నాగలక్ష్మి ప్రియుడితో కలిసి కాశయ్య గొంతు నులిమి హత్యచేసింది. అనంతరం కాశయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది.  అయితే దీనిపై అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల16న ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.  నాగలక్ష్మి,  సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డురావడం, తరచూ నాగలక్ష్మిని వేధిస్తున్నందునే హత్య చేసినట్లు తెలిపారు.


షాలిని పాండే హాట్ ఫోటో షూట్

First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...