హోమ్ /వార్తలు /క్రైమ్ /

So Sad: ఇక తన వల్ల కాదని ఇంటి వెనుక బావి చూసుకుని దూకేసింది.. ఈ అమ్మాయి ఉసురు వాళ్లకు తగలకపోదు..

So Sad: ఇక తన వల్ల కాదని ఇంటి వెనుక బావి చూసుకుని దూకేసింది.. ఈ అమ్మాయి ఉసురు వాళ్లకు తగలకపోదు..

బాధితురాలు నేహా

బాధితురాలు నేహా

సమాజంలో రానురానూ బంధాలకు, అనుబంధాలకూ విలువ లేకుండా పోతోంది. కొందరు మగాళ్లు మృగాలుగా మారి.. విచక్షణ మరిచి.. వావివరుసలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. అత్తింట్లో భర్త తండ్రి అంటే ఆ వివాహితకు తండ్రి లాంటి వాడు. కానీ.. ఆమె భర్త తండ్రి ఆ విషయాన్నే మరిచిపోయాడు.

ఇంకా చదవండి ...

పుణె: సమాజంలో రానురానూ బంధాలకు, అనుబంధాలకూ విలువ లేకుండా పోతోంది. కొందరు మగాళ్లు మృగాలుగా మారి.. విచక్షణ మరిచి.. వావివరుసలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. అత్తింట్లో భర్త తండ్రి అంటే ఆ వివాహితకు తండ్రి లాంటి వాడు. కానీ.. ఆమె భర్త తండ్రి ఆ విషయాన్నే మరిచిపోయాడు. కోడలి విషయంలో తండ్రిలా కాదు కదా కనీసం మనిషిలా కూడా ప్రవర్తించలేదు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. మామ వేధింపులు తట్టుకోలేకపోయిన ఆ 22 ఏళ్ల వివాహిత బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని వడగాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేహా అనే 22 ఏళ్ల యువతికి, అమోల్ పవార్‌ అనే యువకుడితో మార్చి 2020లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కోరినంత పుచ్చుకున్న అమోల్ కుటుంబం పెళ్లయిన కొన్నాళ్లకే నేహాను అదనపు కట్నం కోసం వేధించసాగింది. తండ్రిలా చూసుకోవాల్సిన ఇంటి పెద్దే... ఆ వివాహిత పట్ల ఆమె మామయ్యే అమానుషంగా ప్రవర్తించసాగాడు. ఆమె తన కోడలనే కనీస విచక్షణ లేకుండా ఆమెను తాకుతూ.. తప్పుగా మాట్లాడుతూ ఆమెను మాటలతో చిత్రవధ చేసేవాడు.

మామయ్య తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నేహా తన భర్తకు చెప్పినా అతను కూడా కనీసం పట్టించుకోకపోవడం ఆమెను మరింత బాధించింది. తన మామయ్య అనంత హరిబాహు పవార్ వెకిలి చేష్టలతో, అసభ్య ప్రవర్తనతో నేహా విసిగిపోయింది. తనలో తాను కుమిలిపోయింది. భర్త అదనపు కట్నం కోసం నేహాను తిట్టికొట్టి ఇబ్బందిపెట్టసాగాడు. ఆగస్ట్ 19న కూడా తన మామయ్య వేధించాడు. అత్తింట్లో అందరూ తనను హింసిస్తున్నారని.. తోడుగా ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త కూడా డబ్బు మోజులో పడి తనను అర్థం చేసుకోకపోవడంతో నేహా మానసికంగా కుంగిపోయింది. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న ఆ కుటుంబం మధ్య ఇమడలేకపోయింది. కానీ తనకు తాను క్షణికావేశంలో ఊహించని శిక్ష వేసుకుంది. ఆగస్ట్ 19న ఇంటి నుంచి కనిపించకుండాపోయిన నేహా.. ఆగస్ట్ 21న విగతజీవిగా ఆ ఇంటి సమీపంలోని ఓ బావిలో కనిపించింది.

ఇది కూడా చదవండి: Very Sad: కళ్ల ముందు ఘోరం.. ఈ కుటుంబం చేయలేదే ఏ నేరం.. ఎంతపని జరిగింది శివయ్యా..

మామ వేధింపులు, అత్తింటి వారి అకృత్యాలు తట్టుకోలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నేహా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పాతికేళ్ల కూడా నిండని తమ కూతురి జీవితాన్ని అత్తింటి వారంతా కలిసి నాశనం చేశారని.. అర్థాంతరంగా ఆమె తనువు చాలించేలా చేశారని.. ఆమె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. నేహా తండ్రి ఫిర్యాదు మేరకు నేహా ఆత్మహత్య కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అత్తింటి వారి దాష్టికానికి అన్యాయంగా ఓ వివాహిత బలైపోయింది. ఇంట్లో కోడలితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని మృగాలు మధ్య మనం బతుకుతుండటం శోచనీయం.

First published:

Tags: Crime news, Married women, Wife suicide, Woman suicide

ఉత్తమ కథలు