పెళ్లయిన నెల రోజులకే వివాహిత.. భర్త ఆ పని చేయడంతోనే..

అజయ్‌కు పెళ్లికి ముందు నుంచే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆ మహిళతో అజయ్ నగ్నంగా ఉన్న ఫొటోలు ఉండడంతో భావన్ అతడిని నిలదీసింది.

news18-telugu
Updated: June 6, 2020, 1:04 PM IST
పెళ్లయిన నెల రోజులకే వివాహిత.. భర్త ఆ పని చేయడంతోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోటి ఆశలతో తన మెట్టినింట్లో అడుగు పెట్టిన ఓ వివాహితకు ఊహించని షాక్ తగిలింది. తన భర్త పెళ్లికి ముందు నుంచే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భరించలేకపోయింది. దీంతో ఈ వివాహిత పెళ్లయిన నెల రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మైసూరు నగరం ఆనంద నగరకు చెందిన భావన(24)కు నెల రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీరు అజయ్‌తో వివాహమయ్యింది. కానీ అజయ్‌కు పెళ్లికి ముందు నుంచే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆ మహిళతో అజయ్ నగ్నంగా ఉన్న ఫొటోలు ఉండడంతో భావన్ అతడిని నిలదీసింది. ఈ సంగతి రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది. ఏదోలా పెద్దలు సైతం ఇద్దరికీ రాజీ కుదిర్చారు. కానీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భావన తీవ్ర ఆవేదనకు గురయ్యింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భావన తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: June 6, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading