TikTok: టిక్‌టాక్ చేస్తూ విషం తాగిన మహిళ.. ఇంకేముంది..

TikTok Crime News: మహిళ టిక్‌టాక్ చేస్తూ ఏకంగా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కలకలం రేపుతున్న ఈ విషాద ఘటన తమిళనాడులోని పెరంబూర్‌లో చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 11:58 AM IST
TikTok: టిక్‌టాక్ చేస్తూ విషం తాగిన మహిళ.. ఇంకేముంది..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 11:58 AM IST
ప్రస్తుతం చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందర్నీ కట్టిపడేస్తున్నయాప్.. టిక్‌టాక్. దీనికి ఉన్న ఆదరణ మామూలుగా లేదు. మొబైల్‌లో ఈ యాప్‌ ఉందంటే చాలు.. ఎవరో చేసిన టిక్‌టాక్‌ వీడియోలను చూస్తూ, వాటిని అనుకరిస్తూ మరిన్ని వీడియోలు చేస్తుంటారు. కొన్నింటిని సాహసం చేస్తూ తీస్తుంటారు.కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకొని మరీ వీడియోలు చేస్తుంటారు. అయితే, ఓ మహిళ టిక్‌టాక్ చేస్తూ ఏకంగా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కలకలం రేపుతున్న ఈ విషాద ఘటన తమిళనాడులోని పెరంబూర్‌లో చోటుచేసుకుంది. ఎప్పుడు చూసినా భార్య టిక్‌టాక్ వాడుతోందని భర్త మందలించాడు. వాటిని పక్కనబెట్టి పని చూసుకోవాలని హెచ్చరించాడు.

దీంతో మనస్తాపానికి గురైన వివాహిత.. భర్త తిట్టాడని చెప్పి ఓ భార్య టిక్‌టాక్‌ చేస్తూ విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. బయటనుంచి ఇంటికి వచ్చిన భర్త భార్య అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...